ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఈ రూల్ తెలుసా, పరీక్ష కూడా రాయనివ్వరు

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. క్లాసులు ఎగ్గొట్టేవారిని కాలేజీలకు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు హాజరు నిబంధనను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి కృతిక శుక్లా ఆదేశాలు జారీచేశారు. హాజరు శాతం నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ రెగ్యులర్‌ విద్యార్థులకు 75శాతం హాజరు తప్పనిసరి అని తెలిపారు.

ఎవరైనా విద్యార్థులు.. ఏవైనా ప్రత్యేక సందర్భాలుంటే 15 శాతం వరకు హాజరులో మినహాయింపు ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ సహేతుకమైన కారణాలు లేకపోతే మినహాయింపు ఇవ్వకుండా పరీక్షలకు తిరస్కరించవచ్చని తెలిపారు. అయితే అధికారవర్గాల సమాచారం ప్రకారం.. 60శాతం హాజరు లేనిపక్షంలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను పరీక్షలకు అనుమతించరు. అలాగే ఆర్ట్స్‌ విద్యార్థులను మాత్రం ప్రైవేటు విద్యార్థులుగా పరిగణించి పరీక్షలకు అనుమతించే అవకాశం ఉంది.. వారికి సర్టిఫికెట్‌లో ప్రైవేటు విద్యార్థి అని వస్తుంది. ఇంటర్ విద్యార్థులకు 60 శాతం నుంచి 75 శాతం లోపు హాజరు ఉంటే రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు ఫైన్‌తో పరీక్షలకు అనుమతించే వీలుంది. అదీ సరైన కారణాలుంటేనేనని ఇంటర్ బోర్డు చెబుతోంది.

ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ చదివే జనరల్‌, ఒకేషన్‌ విద్యార్ధులు పరీక్షలు రాయడానికి అర్హత సాధించేందుకు 75 శాతం హాజరు తప్పనిసరి చేశారు. 60 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి కాండినేషన్‌ ద్వారా అవకాశం కల్పిస్తారు.. ఈ మేరకు కళాశాలల ప్రిన్సిపల్‌ విద్యార్ధుల హాజరును పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకురావాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త నిర్ణయాలను అమలు చేసే ప్లాన్‌లో ఉన్నారు. పరీక్షల విధానంతో పాటు సిలబస్‌ను మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను కూడా తీసుకురావాలని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే సిలబస్ మాత్రమే కాకుండా… పరీక్షల విధానంలో కూడా మార్పులు చేయనున్నారు.

About amaravatinews

Check Also

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *