తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప 2 అప్పుడే పలు ఏరియాల్లో అమ్ముడు పోయిందని వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో దాదాపుగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. అందుకే పుష్ప 2 వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం ఖాయం అనే అభిప్రాయంతో అంతా ఉన్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయింది మొదలుకుని ఇంకా ఎప్పుడు రిలీజ్ అంటూ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా బయ్యర్లు సైతం పుష్ప 2 ని కొనుగోలు చేయడం కోసం ఉత్సాహం చూపిస్తున్నారు.
సుకుమార్ ఫిల్మ్ మేకింగ్‌లో మాస్టర్, అలాంటి మాస్టర్ పుష్ప 2 ను కచ్చితంగా మరో అద్భుతంగా రూపొందించి ఉంటాడని అంతా నమ్ముతున్నారు. అందుకే మైత్రి మూవీ మేకర్స్ వారు కోట్ చేసిన మొత్తం కంటే ఎక్కువ రేటు పెట్టి మరీ పలు ఏరియాలను కొనుగోలు చేసేందుకు సిద్ధం అయ్యారట. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే పుష్ప 2 అమ్ముడు పోయింది. ఆయా ఏరియాల్లో చేసిన బిజినెస్‌ని చూస్తే బ్రేక్ ఈవెన్ సాధించడానికి బాహుబలి 2 వసూళ్లను క్రాస్ చేయాల్సిందే అని, ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా సాధించని వసూళ్లు సాధిస్తేనే పుష్ప 2 అక్కడ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందనే చర్చ మొదలైంది. మొత్తానికి పుష్ప 2 సినిమా ఓ రేంజ్ లో బిజినెస్ చేస్తోంది.
బాహుబలి సినిమా దర్శకుడు రాజమౌళికి అభిమాన దర్శకుడు అయిన సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 కి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. పుష్ప హిందీ వర్షన్ వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. అందుకే పుష్ప 2 సినిమా రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేస్తుందని, హిందీ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హిందీలో పుష్ప 2 రూ.250 కోట్లను వసూళ్లు చేయడం ద్వారా రికార్డ్ సృష్టించడం ఖాయం అంటూ ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు కొందరు బాక్సాఫీస్ వర్గాల వారు, సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటూ ఉన్నారు. సినిమా హిందీ వర్షన్ కోసం ప్రత్యేకంగా హంగులు దిద్దినట్లు తెలుస్తోంది.