ఏపీ బీజేపీ నేత రాసలీలలు.. మహిళతో అడ్డంగా బుక్, వీడియో వైరల్

ఏపీకి చెందిన బీజేపీ నేత నిర్వాకం బయటపడింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళతో మీడియా కాల్‌లో మాట్లాడుతూ అసభ్యకరంగా కనిపించారు. గుంటూరుజిల్లాకు చెందిన నేత వీడియోకాల్‌లో మహిళతో మాట్లాడారు. ‘రేపు రాత్రికి రా.. ఇప్పుడు కట్టుకొన్న పూలచీరలోనే రా’ అంటూ ఆమెను సదరు నేత కోరడం ఆ వీడియో కాల్‌లో వినిపించింది.’రేపు ఏడు గంటల కల్లా వచ్చేయ్‌. ఇద్దరం కలిసి మందు కొడదాం’ అన్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ మహిళ కూడా బీజేపీలో కార్యకర్తగా పనిచేస్తుండటం విశేషం.

ఈ వ్యవహారం బీజేపీ నాయకత్వం దృష్టికి వెళ్లింది. బీజేపీ మీడియా వ్యవహారాలు పర్యవేక్షించే నేత ఒకరు దీనిపై విచారణ చేసి.. పార్టీ పెద్దలకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ జిల్లా ముఖ్యనేత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో పార్టీ ఉలిక్కిపడింది. తాజాగా మరో బీజేపీ నేత వీడియో బయటికి రావడం మరింత కలకలం రేపింది. ఆ ఇద్దరు నేతల వీడియోలు బయటకు రావడం వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో కాల్ వ్యవహారంలో మరో ట్విస్ట్ కూడా ఉంది.. గతంలో గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ నేత ఓ మహిళతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది.. ఆ మహిళే ఇప్పుడు బీజేపీ నేతతో మాట్లాడినట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె ఒక పార్టీలో ఉండగా.. ఆ తర్వాత బీజేపీలో చేరారు.

About amaravatinews

Check Also

తిరుమలలో కల్తీకి చెక్.. కొండపై అందుబాటులోకి ఫుడ్‌ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్!

భక్తులకు నాణ్యమైన ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీటీడీ కల్తీకి చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తిరుమలలో నూతనంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *