జిగ్రా విషయంలో ఏం జరుగుతోంది.. నిర్మాత భార్యపై కరణ్ కౌంటర్లు

కరణ్ జోహర్ నిర్మించిన జిగ్రా మూవీతో అలియా భట్ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. జిగ్రా చిత్రం ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయింది. ఓ వైపు శ్రద్దా కపూర్ స్త్రీ 2 ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలియా భట్ జిగ్రా మూవీ డిజాస్టర్‌గా నిలిచేట్టుంది. అలియా భట్ జిగ్రా మూవీ మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఈ మూవీ నార్త్ ఆడియెన్స్‌కి కూడా ఎక్కలేదు. తెలుగులో భారీగానే ప్రమోషన్స్ చేశారు. కానీ తెలుగులో జిగ్రాని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అన్ని చోట్ల థియేటర్లు ఖాళీగానే దర్శనమిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇదే విషయాన్ని టీ సీరిస్ అధినేత భూషణ్ కుమార్ భార్య, నటి దివ్యా ఖోస్లా చెప్పింది. తాను మాల్‌కి వెళ్లానని, జిగ్రా మూవీని చూస్తున్నానని, థియేటర్ మొత్తం ఖాళీగా ఉందంటూ చెప్పుకొచ్చింది. అలా జిగ్రా మీద దివ్యా ఖోస్లా వేసిన కౌంటర్‌కు కరణ్ జోహర్ పరోక్షంగా స్పందించాడు. మూర్ఖులకు మౌనమే సమాధానం అని పోస్ట్ వేశాడు. నిజం ఎప్పటికైనా బయటకు రావాల్సిందే.. అంటూ మళ్లీ కరణ్ పోస్ట్‌కు దివ్యా ఖోస్లా కౌంటర్ ఇచ్చింది.

దీంతో ధర్మ ప్రొడక్షన్స్, టీ సిరీస్ మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించి మరోసారి చర్చల్లోకి వచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్‌లో అలియా ఉంటే.. రణ్‌వీర్ కపూర్ యానిమల్ చిత్రం టీ సిరీస్‌లో ఉంది. ఇప్పుడు రణ్ బీర్‌తో యానిమల్ పార్క్ కూడా షూట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఈ వివాదాలు తలెత్తుతున్నాయి.

About amaravatinews

Check Also

మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్‌: రేవంత్ రెడ్డి

గంటలుగా కొనసాగుతున్న సీఎం, సినీ పరిశ్రమ పెద్దల భేటీ . బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *