దిన ఫలాలు (అక్టోబర్ 15, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా ఉత్సాహం కలిగిస్తుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వాహన యోగానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారి ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా సఫలం అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కొందరు బంధుమిత్రుల నుంచి ఊహించని శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా ఉత్సాహం కలిగిస్తుంది. చేపట్టినా పనుల్లో శ్రమాధిక్యత ఉన్నా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగంలో కొద్దిగా పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. స్వల్ప అనా రోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. నూతన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. వాహన యోగానికి కూడా అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సమాజంలో విశేషమైన గౌరవాభిమానాలు పొందుతారు. సోదరులతో ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా సఫలం అవుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయటా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు సవ్యంగా సాగి పోతాయి. కుటుంబ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా, సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగంలో కొద్దిగా ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ అభిప్రాయాలకు విలువ నిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్య మైన వ్యవహారాలు వాయిదా పడే సూచనలున్నాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సొంత పనుల మీద పెట్టడం అవసరం. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
సన్నిహితులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి. నూతన వస్తు, వాహన లాభాలు పొందడానికి అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలలో కార్యకలాపాలు పెరుగు తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలమవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. అధికారులు ఎక్కువగా ఆధా రపడతారు. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగు తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆశిం చిన సమాచారం అందుకుంటారు. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనుల్ని సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవు తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ వాతావరణం ఉత్సాహం కలిగిస్తుంది. వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన సమస్యలు తొలగి పోతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇంటా బయటా కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఖర్చులు కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. గృహ నిర్మాణ వ్యవహారాలు నిదానంగా కొనసాగుతాయి. ముఖ్య మైన ప్రయత్నాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
చేపట్టిన పనులన్నిటినీ ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుతాయి. బంధుమిత్రులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగంలో శ్రమాధి క్యత ఉన్నప్పటికీ ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. బాకీలు, బకాయిలను వసూలు చేసుకుంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగు తాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాలు, శుభ కార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అందుకు తగ్గట్టుగా కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. రుణ భారం తగ్గే అవకాశం ఉంది. ఇంటా బయటా ఊహించని అనుకూలతలు కలుగుతాయి. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. సోదరులతో స్వల్ప వివాదాలకు అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయి లాభాలు అందుకుం టారు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. పిల్లలు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు చక్కబడుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.