ఏపీలో మహిళలకు శుభవార్త.. దీపావళికి మరో పథకం అమలు, అందరికీ ఉచితంగానే!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ దీపావళికి (అక్టోబర్ 31) ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తాము ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని చెప్పారు. ఏపీలో చాలారోజులుగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారనే చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలో చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాలు ఎప్పటి నుంచో చెప్పారు. దీపావళి మరుసటి రోజు నుంచే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీపావళికి ఉచిత సిలిండర్ల పథకం అమలు చేస్తామని.. ఆ మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం ఫ్రీ బస్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

About amaravatinews

Check Also

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *