లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర సిట్ సభ్యులుగా ఏపీ ప్రభుత్వం పంపిన పేర్లు ఇవే.. డీజీపీ వెల్లడి

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు దేశంలో ఎంత ప్రకంపనలు రేపాయో అందరికీ తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దీనిపై దర్యా్ప్తు జరగాలని.. స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటుపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో ఏపీ పోలీసుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అలాగే తిరుమల లడ్డూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు అనుమానించలేదని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. సున్నితమైన ఈ అంశంలో స్వతంత్ర దర్యాప్తు జరగాలనే ఉద్దేశంతోనే సిట్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇక సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో సభ్యులుగా రాష్ట్రం నుంచి సర్వశ్రేష్ఠ త్రిపాఠి. గోపీనాథ్ శెట్టి పేర్లను పంపినట్లు ఏపీ డీజీపీ వెల్లడించారు.

మరోవైపు తిరుమల లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో.. కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామితో పాటుగా పలువురు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను ఇటీవల విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశింశింది. ఈ సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసులు, అలాగే ఫుడ్ సేఫ్టీ ఇండియా నుంచి ఓ అధికారిని నియమించాలని స్పష్టం చేసింది. ఈ సిట్ దర్యాప్తు తీరును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.

About amaravatinews

Check Also

శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభం

శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. భక్తుల సౌకర్యార్థం శుక్రవారం ఉచిత బస్సును ప్రారంభించారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *