ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. పండగకు ముందే దీపావళి గిఫ్ట్

Diwali: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు 3 శాతం డీఏ(కరవు భత్యం) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 50 శాతంగా ఉన్న డీఏ.. ప్రస్తుతం 53 శాతానికి పెరిగింది. ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతుండగా.. ఈ ఏడాది మార్చిలో పెంచగా.. ప్రస్తుతం మరోసారి పెంచారు. మార్చిలో 4 శాతం పెరిగిన డీఏ.. తాజాగా మరో 3 శాతం పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మొత్తంగా 53 శాతానికి పెరిగింది.

దీపావళి పండగకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. సర్కార్ శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు డీఏ(డియర్‌నెస్ అలవెన్స్), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన పెన్షనర్లకు డీఆర్‌(డియర్‌నెస్‌ రిలీఫ్‌) 3 శాతం పెరిగింది. దీంతో ఉద్యోగులకు వారి బేసిక్ సాలరీలో ఈ డీఏ పెంపు ఉంటుంది. ఈ పెంపు 2024 జులై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర కేబినెట్ తీసుకున్న డీఏ పెంపు నిర్ణయంతో ప్రస్తుతం రూ.18 వేలు బేసిక్‌ వేతనం అందుకుంటున్న ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. అదనంగా రూ.540 అందుకుంటారని తెలుస్తోంది.

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు సార్లు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డీఆర్‌(డియర్‌నెస్‌ రిలీఫ్‌)లో మార్పులు చేస్తూ ఉంటుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల 1.16 కోట్ల మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్‌లకు లబ్ధి చేకూరనుంది. సాధారణంగా డీఏ పెంపు ఏడాదిలో రెండుసార్లు ప్రకటిస్తారు. మార్చిలో హోళీ పండగ సమయంలో ఒకసారి.. దీపావళి పండగ నేపథ్యంలో అక్టోబర్‌-నవంబర్‌ సమయంలో రెండోసారి కేంద్రం ప్రకటిస్తుంది.

About amaravatinews

Check Also

PF ఖాతా ఉన్నవారికి అలర్ట్.. యాక్టివ్ UAN లేకుంటే ఆ సేవలు బంద్.. చెక్ చేసుకోండి!

PF Account: ఎప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సంస్థ అక్టోబర్ 1, 2014 నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *