ఈ ఒక్క నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. పీఎఫ్ బ్యాలెన్స్ క్షణాల్లో ఫోన్‌కు మెసేజ్.. చెక్ చేస్కొండి మరి..!

EPFO: సంఘటిత రంగంలో పని చేసే ఉద్యోగులకు.. దాదాపు కచ్చితంగా పీఎఫ్ అకౌంట్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఒక మంచి పెన్షన్ స్కీమ్ అని చెప్పొచ్చు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు.. నెలెలా పెన్షన్ వచ్చేందుకు కేంద్రం దీనిని తీసుకొచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ దీనిని నిర్వహిస్తుంటుంది. ఇక పీఎఫ్ అకౌంట్ గురించి ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూల్స్ వస్తుంటాయి. దీంట్లో వడ్డీ రేట్లకు సంబంధించి.. నిబంధనల గురించి.. డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేందుకు మార్గదర్శకాలు ఇలా ఇతర చాలా మార్పులు వస్తుంటాయి. కనీసం పదేళ్ల సర్వీస్ తర్వాత రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కూడా అందుతుంది.

ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం ప్రతి నెలా కంపెనీ పీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తుంది. సంస్థ కూడా ఇంతే మొత్తం జమ చేయాలి. దీంట్లో 3 శాతానికిపైగా ఈపీఎఫ్ అకౌంట్‌కు.. మిగతా 8 శాతానికిపైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌కు (EPS) వెళ్తుందని చెప్పొచ్చు. ఇక పీఎఫ్ అకౌంట్లో జమ అయిన మొత్తంపై కేంద్రం.. వడ్డీ యాడ్ చేస్తుంటుంది. ప్రస్తుతం 8.25 శాతం వడ్డీ రేటు ఉంది.

వడ్డీ జమ అవుతుందా లేదా తెలుసుకునేందుకు.. ఇంకా కంపెనీలు పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాయా.. సహా మీ మొత్తం బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకుంటూ ఉండాలి. ఇందుకోసం చాలానే మార్గాలు ఉన్నాయి. ఇందుకోసం కచ్చితంగా యూఏఎన్ నంబర్ యాక్టివ్‌లో ఉండాలి. ఇది మొబైల్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి. అప్పుడు 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పీఎఫ్ బ్యాలెన్స్, లాస్ట్ కాంట్రిబ్యూషన్ మెసేజ్ రూపంలో వస్తుంది.

ఎస్ఎంఎస్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు వీలుంటుంది. ఇందుకోసం 7738299899 నంబర్‌కు EPFOHO అని టైప్ చేసి.. స్పేస్ ఇచ్చి UAN నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు కూడా మెసేజ్ రూపంలో బ్యాలెన్స్ వివరాలు అందుకుంటారు.

ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి వెళ్లి సర్వీసెస్ సెక్షన్లోని ఫర్ ఎంప్లాయీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ మెంబర్ పాస్‌బుక్ ఆప్షన్ ఎంచుకొని యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నంబర్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిపై చేస్తే.. అక్కడ అకౌంట్లో బ్యాలెన్స్ కనిపిస్తుంది.

About amaravatinews

Check Also

టెట్ అభ్యర్ధులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ

టెట్ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *