రేపు 12 గంటలకు ఏం జరగనుంది..? టీడీపీ ట్వీట్ దేనికి సంకేతం!

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రేపు (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు ఏం జరగనుందనేదీ అంతటా ఇంట్రెస్టింగ్‌గా మారింది. అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన ఎక్స్ ఖాతా నుంచి ఈ ట్వీట్ రావడం విశేషం. ” బిగ్ ఎక్స్‌పోజ్.. కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 PM.. స్టే ట్యూన్‌డ్” అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. దీంతో రేపు మధ్యాహ్నం ఏం వెల్లడిస్తారా అనే విషయంమై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అయితే ఎక్స్‌‍పోజ్ అన్నారంటే ఏదైనా కీలక అంశాన్ని బహిర్గతం చేసే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన ఉంటుందా.. అంటే.. అలాంటి విషయాలను ముఖ్యమంత్రి కానీ.. లేదా మంత్రులు, శాఖల అధికారులు వెల్లడించే అవకాశం ఉంటుంది. ఇలా పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారంటే తెలుగుదేశం పార్టీకి, రాజకీయాలకు సంబంధించిన విషయమై ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక పార్టీ సభ్యత్వ నమోదు కూడా మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దీంతో దానికి సంబంధించిన విషయం కూడా కాదనే విషయం స్పష్టమవుతోంది. ఏంటా అనేదీ తెలియాలంటే గురువారం మధ్యాహ్నం వరకూ వేచి చూడాల్సిందే. మరోవైపు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇటీవలే ఇలాగే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో టీసీఎస్ పెట్టుబడుల విషయమై.. రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ ఇటీవల లోకేష్ ట్వీట్ చేశారు. ఆ మరుసటి రోజు.. విశాఖలో టీసీఎస్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తరహాలోనే ఇప్పుడు కూడా.. టీడీపీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తోంది. అయితే బిగ్ ఎక్స్‌పోజ్ అని అన్నారంటే.. ప్రకటన కాకుండా ఏదో విషయాన్ని బయటపెట్టనున్నట్లు భావించవచ్చు.

మరోవైపు టీడీపీలో సభ్యత్వ నమోదు అక్టోబర్ 26వ తేదీ నుంచి మొదలుకానుంది. రూ.100లు చెల్లిస్తే సాధారణ సభ్యత్వం ఇవ్వనున్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలకు రూ.5 లక్షలు బీమా సదుపాయం కల్పించనున్నారు. ఇక ఈ ఏడాది నుంచి టీడీపీ కొత్తగా జీవితకాల సభ్యత్వం ఇవ్వనుంది. సభ్యత్వ నమోదుపై ఇప్పటికే నేతలకు అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సభ్యత్వం నమోదులో అందరూ పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

About amaravatinews

Check Also

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రాకు ఇంకా వర్షాలు వీడలేదు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. కోస్తా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *