ఏపీ ప్రభుత్వం ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక సరస్వతీ ఘాట్‌లో ఆధ్యాత్మిక బస్సు యాత్రను పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రారంభించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తుండగా.. ఈ యాత్రలో ఒకేరోజు ఆరు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ముందుగా కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి అన్నవరం సత్యనారాయణస్వామి, పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి, సామర్లకోట కుమారరామ భీమేశ్వరస్వామి, ద్రాక్షారామ భీమేశ్వరస్వామిలను దర్శించుకుంటారు. చివర్లో రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్‌లో గోదావరి హారతితో బస్సు యాత్ర ముగుస్తుంది. ప్రతి శనివారం ఈ యాత్ర అందుబాటులో ఉంటుంది. ఈ యాత్ర కోసం పెద్దలకు టికెట్ రూ.వెయ్యి, మూడేళ్ల నుంచి పదేళ్లలోపు పిల్లలకు మాత్రం రూ.800గా నిర్ణయించారు. వివరాలకు 98486 29341,9848883091 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
మరోవైపు కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాజమహేంద్రవరం నుంచి కూడా బస్సుల్ని పంచారామాలు, శబరిమలై యాత్రకు బస్సుల్ని నడుపుతున్నారు.. ఈ మేరకు వాల్‌పోస్టర్లను ఆర్టీసీ అధికారులు ఆవిష్కరించారు. వచ్చే నెలలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం డిపో నుంచి పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక యాత్ర బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. నవంబరు 3, 10, 17, 24, డిసెంబరు 1 తేదీల్లో (ప్రతి సోమవారం) ప్రతి ఆదివారం రాత్రి ఏడు గంటలకు ఇక్కడి నుంచి భక్తులతో ఈ సర్వీసులు బయలుదేరి వెళుతుందున్నారు.