పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్స్.. సుకన్య సమృద్ధి, పీపీఎఫ్‌కు ఫుల్ డిమాండ్.. కనీసం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఎన్నేళ్లు కట్టాలి?

Sukanya Samriddhi Yojana: కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్నో పథకాల్లో పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఒకటి. ఇక్కడ నిర్ణీత కాలవ్యవధికి ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీకి మంచి లాభాలు అందుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా అన్ని వర్గాల వారి కోసం.. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, రిటైర్మెంట్ స్కీమ్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఆడపిల్లల కోసమైతే సుకన్య సమృద్ధి యోజన, మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, రిటైర్మెంట్ ఫండ్ కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్, నెలనెలా పింఛన్ అందుకునేందుకు ఇది పనిచేయడం సహా ఇంకా మంత్లీ ఇన్‌కం సర్టిఫికేట్ స్కీమ్ కూడా ఉంది. ఉద్యోగుల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజెన్లకు లబ్ధి చేకూర్చేందుకు సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ ఉండనే ఉంది. ఇంకా ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లు ఇలా వేర్వేరు వ్యవధులతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా పథకాల్లో ఆదాయపు పన్ను చట్టం- 1961, సెక్షన్ 80c కింద ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు టాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.

>> పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్- ఇక్కడ సింగిల్ లేదా జాయింట్‌గా అకౌంట్ తెరవొచ్చు. కనీసం రూ. 500 తో ఖాతా తెరవొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఇక్కడ వార్షికంగా 4 శాతం వడ్డీ రేటు ఉంది.
>> నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్- ఇక్కడ కేవలం నెలకు రూ. 100తో కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. ఇక్కడ ఐదేళ్ల వ్యవధి ఉంటుంది.

>> నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కం అకౌంట్- ఇక్కడ కూడా కనీసం రూ. 1000 పెట్టుబడితో చేరొచ్చు. సింగిల్ అకౌంట్ కింద ఇందులో గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంట్ కింద రూ. 15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో వడ్డీ రేటు 7.40 శాతం.
>> సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్- ఈ పథకం కేవలం సీనియర్ సిటిజెన్లకు మాత్రమే. కనీసం రూ. 1000 తో అకౌంట్ తెరవొచ్చు. గరిష్టంగా రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. సింగిల్ లేదా భాగస్వామితో కలిసి ఖాతా తెరవొచ్చు. దీంట్లో ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. వడ్డీ రేటు అత్యధికంగా 8.20 శాతంగా ఉంది. గరిష్ట పెట్టుబడితో ప్రతి నెలా రూ. 20,500 వరకు పెన్షన్ అందుకోవచ్చు. 3 నెలలకు కలిపి ఒకేసారి రూ. 61,500 అందుతుంది.

About amaravatinews

Check Also

డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే.. అన్ని పార్టీల నుంచి పెరుగుతున్న డిమాండ్!

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల..పార్టీలకు అతీతంగా రాజకీయ, సినీ ప్రముఖులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *