ఆ రాశి వారికి ధన యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 1, 2024): మేష రాశి వారికి ఆదాయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. పని భారం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగు తుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభా లందుకుంటారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. గట్టి ప్రయ త్నంతో ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. చేపట్టిన వ్యవహారాలన్నీ సంతృప్తికరంగా పూర్తవు తాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. మిత్రుల నుంచి శుభ వార్తలు వింటారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక వ్యవ హారాల్లో సన్నిహితుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచి పోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. కొందరు మిత్రుల నుంచి విలువైన వస్తువులు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా, నిల కడగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. వ్యయ ప్రయాసలతో కొన్ని వ్యవహారాలు పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం అనేక వైపుల నుంచి వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

పెళ్లి సంబంధాల విషయంలో దగ్గర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయ త్నాలు కూడా సఫలం అవుతాయి. ఎటువంటి ఆదాయ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధి స్తారు. డాక్టర్లు, లాయర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆర్థికంగా సమయం చాలావరకు అనుకూ లంగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచ యాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయావకాశాలు బాగా వృద్ది చెందుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగంలో మరింత పురోగతి సాధిస్తారు. కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ వ్యవ హారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అంది వస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. మిత్రులు కూడా తప్పుదోవ పట్టించే అవ కాశం ఉంది. ధన యోగం పట్టే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు అందుకుంటారు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తల్లితండ్రుల జోక్యంతో ముఖ్యమైన ఆస్తి సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఉద్యోగంలో సహోద్యోగుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. బాధ్యతల పరంగా ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ప్రస్తుతా నికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మొండి బాకీలు వసూలు అవుతాయి. ప్రయాణాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

About amaravatinews

Check Also

Horoscope Today: ఆదాయ ప్రయత్నాల్లో వారికి విజయం.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (డిసెంబర్ 2, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *