Pawan Kalyan: పరిస్థితి చేయిదాటితే నేనే హోంమంత్రి.. పవన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి పదవిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఏపీలో శాంతి, భద్రతలపైనా, హోం శాఖపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో.. తాను హోంమంత్రిని అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీశాఖ మంత్రిని అని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఏపీలో జరుగుతున్న ఘటనలకు హోంమంత్రి వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలన్నారు. హోంశాఖపై రివ్యూ చేయాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

లా అండ్ ఆర్టర్ చాలా కీలకమన్న పవన్ కళ్యాణ్.. పరిస్థితులుు ఇలాగే కొనసాగితే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. తాను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయని హెచ్చరించారు. ఇండియన్ పీనల్ కోడ్ పోలీసులకు ఏం చెప్తోందన్న పవన్.. కులంతో సంబంధం లేకుండా నేరస్థులను శిక్షించాలన్నారు. గత ప్రభుత్వంలోలాగా పోలీసులు అలసత్వంతో ఉండొద్దని.. తెగేవరకూ లాగకండి అంటూ సూచించారు. ఘటనలపై బయటకు వస్తే తమను తిడుతున్నారని.. డీజీపీ బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

“వైసీపీ వాళ్లు ఇష్టమొచ్చినట్లు రౌడీల్లా వ్యవహరిస్తుంటే హోంమంత్రి వంగలపూడి అనిత ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకోరా? ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా? మీరు బాధ్యతగా వ్యవహరించండి, బలంగా పనిచేసి చట్టపరంగా వ్యవహరించండి. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, హోంశాఖ మంత్రిని కాదు, పరిస్థితులు చెయ్యి దాటితే నేను హోంశాఖ తీసుకుంటాను, నేను తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహాలో వ్యవరిస్తా. డీజీపీ గత ప్రభుత్వం తరహాలో వ్యవహరించకూడదు. బాధ్యత తీసుకోండి, పాత పద్ధతులు పాటిస్తాం అంటే చూస్తూ ఊరుకోను, ప్రజలు ఇచ్చిన పదవి ఇది, వారికి రక్షణ కల్పించాలి. పాలనలో ఒకరు వచ్చి ఇంకొకరిపై విమర్శలు చేస్తాం, చులకనగా చూస్తాం అంటే.. నాకు పదవి పోయినా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. కానీ నా ప్రజల కోసంపోరాటం చేయడానికి సిద్ధం” అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో ఎన్డీఏ కూటమిది స్థిరమైన ప్రభుత్వమని చెప్పిన పవన్ కళ్యాణ్.. వ్యక్తులు చేసే తప్పులపై చర్యలు ఉంటాయని చెప్పారు. అలాగే కూటమిని ఎవరు చెడగొట్టలేరని, వ్యక్తులు వచ్చి ఎవరికి వారు సొంత పెత్తనం చేసుకుని గేమ్స్ ఆడితే తమను ఏమీ చేయలేరన్నారు. తాను, చంద్రబాబు క్లారిటీతో ఉన్నామన్న పవన్ కళ్యాణ్.. ఈ పొత్తు స్థిరమైందని.. కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు తమ పొత్తును దెబ్బతీయలేవన్నారు.

About amaravatinews

Check Also

ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్‌ ఇయర్లీ ఎగ్జామ్స్‌.. CBNతో అట్టా ఉంటది

బహుశా మీ అందరికీ కార్పొరేట్ కల్చర్‌ గురించి తెలిసే ఉంటుంది. MNC కంపెనీల్లో ఉద్యోగులకు KRA అని ఒకటి ఉంటుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *