ఏపీలో ప్రభుత్వానికి మరో బ్యాంక్ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి సహకార బ్యాంకు (ఆప్కాబ్‌) ఉద్యోగులు రూ.1.16 కోట్ల విరాళాన్ని అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో సహకార శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌బాబు, బ్యాంకు ఎండీ డా.ఆర్‌.ఎస్‌.రెడ్డి, సీజీఎంలు ఎన్‌.వెంకటరత్నం, రామచంద్రయ్య, ఉద్యోగులు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి చెక్కును ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లా రాంప్రసాద్ రెడ్డి రాజధాని నిర్మాణం, అన్న క్యాంటీన్ల నిర్వహణకు రాయచోటి నియోజకవర్గ వ్యాపారులు, వర్తక సంఘాల తరఫున రూ.10 లక్షల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.

మరోవైపు ఏపీలో వరద బాధితుల కోసం తమిళనాడు వెల్లూరులోని గోల్డెన్‌ టెంపుల్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. రాష్ట్రంలో వరద బాధితుల కోసం రూ5000 కుటుంబాలకు సరిపడే దుప్పట్లు, చీరలు, పంచెలు, టవళ్లు తీసుకొచ్చారు. కిట్‌ గురించి సీఎం చంద్రబాబుకు ట్రస్టు ప్రతినిధులు వివరించారు. రూ.85లక్షల విలువైన దుస్తులు అందజేశారు.. పంపిణీ నిమిత్తం దేవాదాయ శాఖ కమిషనర్‌కి వీటిని అప్పగించారు. కార్యక్రమంలో సినీ నిర్మాత ఎన్‌వీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో సెప్టెంబరులో భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన వారి సహాయార్ధం.. పిఠాపురం ప్రగతి విద్యాసంస్థల యాజమాన్యం, విద్యార్ధులు, సిబ్బంది తమవంతు సహాయంగా రూ.7 లక్షల విరాళమిచ్చారు. ఈ చెక్కును సీఎం సహాయనిధికి అందజేయాలని.. పిఠాపురం నియోజకవర్గం పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు అందజేశారు. కాకినాడ రూరల్‌ మండలం పి.వెంకటాపురం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ గురుకులంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాజీ సమక్షంలో అందించారు. వరద బాధితుల సహాయార్ధం మానవతా దృక్పధంతో స్పందించి విరాళాన్నిచ్చిన ప్రగతి యాజమాన్యాన్ని, సిబ్బంది, విద్యారుల్ని పవన్ కళ్యాణ్ అభినందించారు.

మరోవైపు సుభానికేతన్‌ విద్యార్థులు, సిబ్బంది కలిపి వరదబాధితుల సహాయార్ధం సీఎం సహాయనిధికి రూ.2లక్షల విరాళాన్ని చెక్కురూపంలో సవన్ కళ్యాణ్‌‌కు అందజేశారు. ఏపీలో సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదలతో నష్టపోయిన బాధితుల కోసం దాతలు తమవంతుగా సాయం అందించారు.. తమకు తోచిన విధంగా విరాళాలు అందజేశారు. అలాగే అన్న క్యాంటీన్‌లు, అమరావతికి కూడా విరాళాలు ఇస్తున్నారు.

About amaravatinews

Check Also

ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. నైరుతి , ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *