ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. పెద్ద కష్టమే వచ్చింది

ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త మద్యం పాలసీ అమలవుతోంది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులకు లాటరీ నిర్వహించి అప్పగించారు. ఆ వెంటనే అమ్మకాలు మొదలయ్యాయి..రూ.99కే క్వార్టర్‌ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ కొత్త మద్యం విధానం అమల్లో ఉంటుంది. అయితే మందుబాబులకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్రంగా కొరత ఉందని చెబుతున్నారు. వ్యాపారులు ఆర్డర్లు పెడుతున్నా ఆయా బ్రాండ్ల మద్యం తగినంత మేర షాపులకు సరఫరా కావడం లేదు.

ఈ మద్యం బ్రాండ్లలో ప్రధానంగా ఇంపీరియల్‌ బ్లూ, మెక్‌ డోవెల్స్‌ వంటి బ్రాండ్లకు బాగా కొరత ఉంది అంటున్నారు. బీర్లలో కింగ్‌ఫిషర్‌, బడ్‌వైజర్‌ వంటి వాటి లభ్యత బాగా తక్కువగా ఉందని చెబుతున్నారు. పది కేసులకు ఆర్లరు పెడితే కనీసం ఒక్క కేసు కూడా సరఫరా కావట్లేదు. దీంతో మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చింది. అయితే అధికారులు మాత్రం త్వరలోనే అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.

రాష్ట్రంలో మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్టు షాపులను ఉపేక్షించవద్దని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదనే సంకేతాలివ్వాలని అధికారులకు సూచించారు. ఎక్సైజ్‌ శాఖ సిబ్బందితో మంత్రి రవీంద్ర సమీక్ష నిర్వహించారు. ఏపీని కల్తీ మద్యం రహిత రాష్ట్రంగా తయారు చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలని.. అవసరమైన చోట్ల డీఅడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి కొల్లు రవీంద్ర.

About amaravatinews

Check Also

పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి.. సింగపూర్ పర్యటనలో పెట్టుబలడుకు ఏపీ సీఎం ఆహ్వానం!

సింగపూర్ పర్యటనలో చివరి రోజున దిగ్గజ సంస్థలు, ప్రముఖ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు అయ్యారు.పెట్టుబడులతో రండి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *