ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీ ప్లేన్‌లో ప్రయాణించారు. శనివారం విజయవాడ పున్నమి ఘాట్‌లో సీఎం చంద్రబాబు, విజయవాడ శ్రీశైలం సీ ప్లేన్ సర్వీస్ ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్‌లో ప్రయాణించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులతో కలిసి చంద్రబాబు సీ ప్లేన్‌లో శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం పాతాళగంగలో సీ ప్లేన్ ల్యాండ్ చేశారు. అక్కడ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం పాతాళగంగ వద్ద నుంచి చంద్రబాబు రోప్ వేలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైల మల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు.. విజయవాడ నుంచి శ్రీశైలం సీ ప్లేన్‌లో రావటం సరికొత్త అనుభూతి ఇచ్చిందన్నారు. ఇన్నేళ్లుగా విమానాల్లో తిరుగుతున్నప్పటికీ రాని అనుభూతి సీ ప్లేన్ జర్నీలో వచ్చిందని చంద్రబాబు చెప్పారు.
Check Also
సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..
సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …