కర్నూలు: హాస్టల్‌ కూరలో మాత్రలు కలిపిన విద్యార్థులు.. 9మందికి అస్వస్థత, కారణం తెలిసి షాక్

కర్నూలులో ఇద్దరు విద్యార్థులు చేసి ఆకతాయి పనికి తోటి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. కర్నూలు సి క్యాంపులోని ప్రభుత్వ బాలుర వికలాంగుల హాస్టల్‌ ఉంది. ఈ వసతి గృహంలో వివిధ తరగతులు చదువుతున్న 30 మంది ఉంటున్నారు. వీరిలో ఒక పీజీ విద్యార్థి కూడా ఉండగా.. విద్యార్థుల మధ్య అతడు తరచూ వివాదాలకు కారణం అవుతున్నాడు. హాస్టల్‌లో విద్యార్థుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ గొడవల కారణంగా పీజీ విద్యార్థి, మరో 8వ తరగతి చదువుతున్న మరో బాలుడితో కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు. తోటి విద్యార్థులపై కోపంతో.. శనివారం రాత్రి హాస్టల్‌‌లో వండిన సొరకాయ కూరలో గుర్తుతెలియని మాత్రలు కలిపేశారు. కొద్దిసేపటి తర్వాత ఈ సొరకాయ కూర తిన్న వారిలో తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులకు సరైన సమయంలో చికిత్స అందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇటీవల పల్నాడు జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన మరొకటి జరిగింది. ఇద్దరు బాలురు పందెం వేసుకుని మోతాదుకు మించి ఐరన్‌ మాత్రలు మింగారు… వీరిలో ఒకరు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాడు. పల్నాడు జిల్లా ఈపూరు ఎస్సీ బాలుర హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు హని గురు, సతీష్‌లు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. పాఠశాలలో వైద్య సిబ్బంది ఐరన్‌ మాత్రలు పంపిణీ చేయగా.. వీరిద్దరు ఎవరు ఎక్కువ మాత్రలు మింగితే వారు గెలిచినట్లుగా పందెం పెట్టుకున్నారు. హని గురు 20, సతీష్‌ 10 మాత్రలు మింగారు.. అయితే సాయంత్రం హని గురు స్కూల్ గ్రౌండ్‌లో అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. వెంటనే గమనించిన తోటి విద్యార్థులు అక్కడ టీచర్లకు సమాచారం ఇవ్వగా.. అతడిని ఈపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సతీష్‌ కూడా ఎక్కువ మాత్రలు మింగాడని తెలియడంతో ఆ విద్యార్థిని నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *