అల్లూరి జిల్లా: 18మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన మహిళా అధికారి.. ఆ చిన్న కారణానికే ఇలా

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం జరిగింది. ఉదయం ప్రతిజ్ఞకు హాజరుకాలేదన్న కారణంతో విద్యార్థినుల జుత్తును ప్రత్యేక అధికారిణి కత్తిరించారు. జి.మాడుగులలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి రోజు అక్కడ నీరు అందుబాటులో లేదు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారు. వీరిలో 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థినుల్లో నలుగురిపై చేయి చేసుకున్నారు సాయిప్రసన్న. అక్కడితో ఆగకుండా.. విద్యార్థినులను ఎండలో నిల్చోబెట్టడంతో ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు.ఆ తర్వాత మధ్యాహ్న భోజన విరామ సమయంలో 18 మంది విద్యార్థినుల జుత్తును కొద్ది కొద్దిగా అధికారిణి సాయిప్రసన్న కత్తిరించారు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ నెల 15న విద్యార్థినులు ప్రతిజ్ఞకు, తరగతులకు కూడా రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న చెబుతున్నారు. వీకె ఒంటి గంట వరకు జుత్తు విరబోసుకొని తిరుగుతురన్నారు.. అందుకే వారిలో క్రమశిక్షణ అలవర్చేందుకు కొందరి జుత్తును కొద్దిగా కత్తిరించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎంఈవో బాబూరావు పడాల్‌. క్రమశిక్షణ అలవాటు చేసేందుకు జుట్టు కత్తిరించాల్సిన అవసరం ఏంటని.. మందలిస్తే సరిపోయేదంటున్నారు.

About amaravatinews

Check Also

ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్‌ ఇయర్లీ ఎగ్జామ్స్‌.. CBNతో అట్టా ఉంటది

బహుశా మీ అందరికీ కార్పొరేట్ కల్చర్‌ గురించి తెలిసే ఉంటుంది. MNC కంపెనీల్లో ఉద్యోగులకు KRA అని ఒకటి ఉంటుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *