ఆపదొస్తే, ఒక్క మెసేజ్‌ చేయాలనిపించలేదా.. పెద్ద తప్పు చేశావు తమ్ముడు: మంత్రి లోకేష్ ఎమోషనల్

టీడీపీ కార్యకర్త, తనకు అభిమాని శ్రీను మృతిపై మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ అయ్యారు. అందరి కష్టాల గురించి తన దృష్టికి తెచ్చే శ్రీను.. తన కష్టం గురించి మాత్రం ఎప్పుడూ చెప్పలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఆత్మహత్య చేసుకుని పార్టీకి, తనకు తీరని లోటు మిగిల్చావంటూ బాధపడ్డారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గొర్రెపాడుకు చెందిన ఐటీడీపీ కార్యకర్త గుంటూరు శ్రీను.. శనివారం ఉదయం ఇంటి దగ్గర గడ్డి మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు చిలకలూరిపేటలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం లోకేష్‌కు తెలియడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి టీడీపీ నేతలతో కలిసి తరలించారు. చివరకు ఆరోగ్యం విషమించి శనివారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీను భౌతికకాయంపై టీడీపీ జెండా కప్పి.. స్వగ్రామానికి తరలించిన పార్టీ నేతలు.. ఆదివారం అంత్యక్రియలు పూర్తిచేశారు.శ్రీను మరణం తనను ఎంతగానో బాధించింది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ‘అన్నా.. అన్నా.. అని పిలిచేవాడివి. ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా పుట్టినరోజు, పెళ్లి రోజులను ఓ పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ. ఆత్మాభిమానం ఉండొచ్చు. ఆత్మ..హత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శీను.. నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను.. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తాను’అన్నారు.

‘తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో ఏమైనా కానివ్వండి.. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు.. ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు’ అని సూచించారు లోకేష్.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *