ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కలిశారు. ఎల్లుండి సచివాలయం ప్రాంగణంలో జరగనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. తన ఫాంహౌస్‌కు వచ్చిన మంత్రిని కేసీఆర్ మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందానికి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వంశిధర్ రావు తదితరులు సాదర స్వాగతం పలికారు. తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు లంచ్ ఆతిథ్యమిచ్చి కేసీఆర్ గౌరవించారు.
కాగా, సచివాలయంలో ఈ నెల 9న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. ఈ విగ్రహావిష్కరణకు మాజీ సీఎం కేసీఆర్ ను, కేంద్రమంత్రులను ఆహ్వానిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇదివరకే తెలిపారు.