పూరి.. చార్‌ధామ్ యాత్రలో ఒకటి. అయితే హైదరాబాద్ వాసులు చాలామంది దూరం, బడ్జెట్ కారణంగా వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారికోసం ఆ జగన్నాథుడు భాగ్యనగరంలో కూడా దర్శనం ఇస్తున్నాడు. మరి హైదరాబాద్లో పూరి జగన్నాథ ఆలయం ఎక్కడ ఉంది.? ఈ టెంపుల్ చరిత్ర ఏంటి.?
హైదరాబాద్‌లోని శ్రీ జగన్నాథ ఆలయం కళింగ కల్చరల్ ట్రస్ట్ అద్భుతమైన సృష్టి. ఈ పవిత్ర స్థలం ప్రజల మనస్సులలో హృదయాలలో దైవిక ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఇది అచ్చం పురిలో ఉన్న టెంపుల్ మాదిరిగానే ఉంటుంది. పూరి వెళ్లలేము అనుకునేవారికి ఇది మంచి ఎంపికనే చెప్పవచ్చు.
ఈ హిందూ దేవాలయం హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెం.12లో ఉంది. కేబీఆర్ పార్క్ చేరువలోనే ఉంది. ఈ ఆలయాన్ని మార్చి 2009లో కళింగ కల్చరల్ ట్రస్ట్ నిర్మించి స్వామిని ప్రతిష్టించారు. ఈ ఆలయం నిర్మించాలనే ఆలోచన 1992లో హైదరాబాద్కు వలస వచ్చిన ఒడియా తెగకు వచ్చింది.
1992 నుండి పవిత్ర ఆలయ నిర్మాణం కోసం హోమాలు, యజ్ఞాలు, పూజలు, కీర్తనలు చేస్తూ ఉన్న అది కుదరలేదు. అయితే 2004లో ఊహించని పరిణామాల ఫలితంగా చేతివృత్తులవారు, శిల్పులు దేవుడు ఆదేశించినట్లుగా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి స్వయంగా రావడంతో అద్భుతమైన ఆలయ నిర్మాణం ప్రారంభమైంది.
100 మందికి పైగా అంకితభావంతో పనిచేసే కార్మికులు దాదాపు ఐదు సంవత్సరాలు శ్రమించి, గణేష్, ఆంజనేయ స్వామి, విమల, లక్ష్మి, శివుడు, నవగ్రహులతో కలుపుకొని ప్రధాన ఆలయ నిర్మాణం మార్చి 2009లో పూర్తయింది.
పూరి జగన్నాథ ఆలయ నిర్మాణ చరిత్ర, దశావతారం, వివిధ రూపాలు, దేవతల రహస్యాలు వంటి అద్భుతాలను కలిగి ఉన్న సరిహద్దు గోడపై ఉన్న పౌరాణిక, మతపరమైన జ్ఞానోదయం కలిస్తాయి. ఆలయ లైటింగ్ కళాత్మకంగా ప్రణాళిక చేయబడింది. ఈ ఆలయం రాత్రిపూట అద్భుతంగా కనిపిస్తుంది.
Amaravati News Navyandhra First Digital News Portal