UPSC: యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. ఇంకా 5 ఏళ్ల పదవీ కాలం ఉండగానే మనోజ్ సోని.. తన పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం తీవ్ర ఊహాగానాలకు దారి తీస్తోంది. అయితే గత ఏడాది యూనియన్ పబ్లిక్ కమిషన్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ సోని.. ఉన్నట్టుండి రాజీనామా చేయడం కీలకంగా మారింది. మరోవైపు.. ఇటీవల కొన్ని రోజులుగా ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదం కొనసాగుతుండగా.. ఈ సమయంలో యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే మనోజ్ సోనీ రాజీనామా నిర్ణయం.. ఆయన వ్యక్తిగత కారణాలతోనే తీసుకున్నారని యూపీఎస్సీ అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి.
అయితే యూపీఎస్సీ ఛైర్మన్గా మనోజ్ సోని.. 2023 ఏప్రిల్లో బాధ్యతలు చేపట్టారు. ఇక మనోజ్ సోని.. పదవీకాలం ఇంకా ఐదేళ్లు ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వివాదం తీవ్ర సంచలనంగా మారిన వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Amaravati News Navyandhra First Digital News Portal