తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.లడ్డూ తయారీ కల్తీ బాధకరమ్నారు. వక్ప్ బోర్డు చట్ట సవరణ కూడా అలాంటిదేనన్నారాయన. జాయింట్ పార్లమెంటరీ కమిటీ పర్యటనల క్రమంలో ఆయన కామెంట్స్ కలకలం రేపాయి. 28న JPC హైదరాబాద్‌కు రాబోతుంది.
వక్ఫ్ సవరణ బిల్లు-2024ను సమీక్షించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వాళ్టి నుంచి అక్టోబర్ 1 వరకు రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఐదు రాష్ట్రాల్లో చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థల ప్రతినిధులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కమిటీ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. ఈ నెల 28న జేపీసీ హైదరాబాద్‌కు వస్తుందన్నారు తెలంగాణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేని. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు, ముస్లిం సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపి అభిప్రాయాలను తీసుకుంటుందన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో హైదరాబాద్ ఎంపీ, AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సభ్యుడిగా ఉన్నారు. సవరణ పేరిట ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
ఇదే విషయంపై మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ.. తిరుమల లడ్డూ అంశంపై కూడా స్పందించారు లడ్డూలో వాడే నెయ్యిలో కొవ్వు కలిసిందని అంటున్నారు. పవిత్రంగా భావించే ప్రసాదంలో అలా జరగడం బాధాకరమన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కూడా అలాంటిదేనన్నారు. ముస్లిం సంస్థల్లో హిందువులను ఎలా పెడతారంటూ ప్రశ్నించారు.
Amaravati News Navyandhra First Digital News Portal