Flight Tickets: విమాన ప్రయాణికులకు అదిరే ఆఫర్. తక్కువ ధరకే విమానంలో చక్కర్లు కొట్టవచ్చు. తరుచూ ప్రయాణం చేసే వారితో పాటు ఒక్కసారైనా విమానం ఎక్కాలని భావించే వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇందుకోసం దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఫ్లాష్ సేల్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రత్యేక సేల్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఈ సేల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే రూ.1444కే విమానం ఎక్కడమే కాదు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లాస్ సేల్ టికెట్ల బుకింగ్ మొదలైంది. నవంబర్ 13వ తేదీ వరకు ఈ ఫ్లాష్ సేల్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ సేల్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని నవంబర్ 19,2024 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30, 2025 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఆరు నెలల వరకు సమయం ఉంటుంది. ఈ శీతాకాలంతో పాటు వచ్చే వేసవికాలంలో టూర్ వెళ్లాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఎంపిక చేసిన రూట్లలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్స్‌లో భాగంగా ప్రత్యేక డిస్కౌంట్లతో ఎక్స్‌ప్రెస్ లైట్ ద్వారా రూ.1444కే విమాన ప్రయాణం కల్పిస్తోంది. కొన్ని రూట్లలో ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఆఫర్ ద్వారా రూ.1599కే టికెట్లు అందిస్తోంది. దీంతో పాటు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్.కామ్‌లో లాగిన అయితే జీరో కన్వీనియన్స్ ఫీ ఉంటుందని తెలిపింది.
Amaravati News Navyandhra First Digital News Portal