అలేఖ్య తారకరత్న తాజాగా తన ఫాలోవర్లతో ఇన్ స్టాలో చిట్ చాట్ చేసింది. తన బర్త్ డే సందర్భంగా అలేఖ్య అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. బాలయ్య బాబు విష్ చేశాడా? అని ఓ నెటిజన్ అడిగితే.. విష్ చేయలేదు.. ఆయన బిజీగా ఉండి ఉంటారు అని సమాధానం ఇచ్చేసింది. ఇక విజయ సాయి రెడ్డి మీద వస్తోన్న రూమర్ల మీద, నందమూరి కుటుంబం దూరం పెట్టడం.. నారా లోకేష్ ఆర్థిక సాయం ఇలా అనేక అంశాల మీద అలేఖ్య సమాధానం చెప్పింది.
తారకరత్న గారి అమ్మానాన్నలు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు.. ఇంకా దూరం పెడుతూనే ఉన్నారెందుకు అని అడిగితే.. సమాధానం తెలిస్తే బాగుండు.. చెప్పేదాన్ని అంటూ రిప్లై ఇచ్చింది. మీ అత్తమామలతో కలిసి ఉన్న ఫోటోను పెట్టండని అడిగితే.. ఇంత వరకు వాళ్లని కలవనేలేదు.. అలాంటప్పుడు ఫోటో ఎలా ఉంటుంది అని తిరిగి ప్రశ్నించింది. మీరు వాళ్లతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారా? అని అడిగితే.. అవును కలిసి ఉండాలనే ఉందని చెప్పింది.
ఒంటరిగా ముగ్గురు పిల్లల్ని పోషించడం కష్టంగా అనిపించడం లేదా? ఎలా పోషిస్తున్నారు.. డబ్బులు ఎక్కడి నుంచివస్తున్నాయి.. వ్యాపారాలు ఏమైనా ఉన్నాయా? అని అడిగేశారు.. అవును పిల్లల్ని పెంచడం కష్టంగానే ఉంది.. నా శాయశక్తులా కష్టపడి పెంచుతున్నా.. వ్యాపారాలు అయితే ఏమీ లేవు.. ఏదైనా పని చేయాలని అనుకుంటున్నాను.. వర్క్ కోసం ప్రయత్నిస్తున్నాను అంటూ అలేఖ్య తెలిపింది.
రాజకీయాల్లోకి వస్తారా? అని అడిగితే.. నో.. ఇప్పుడు నా ప్రపంచం అంతా పిల్లలే.. వారి కోసమే టైం కేటాయించాలి.. వారికి నా అవసరం ఉంది అని చెప్పుకొచ్చింది. విజయసాయి రెడ్డి మీద వస్తున్న విమర్శలు, ఆరోపణల మీద స్పందిస్తూ.. ఆయనేంటో మాకు తెలుసు అని సమాధానం ఇచ్చింది. నారా లోకేష్, బ్రాహ్మాణి మీ పిల్లల చదువు కోసం సాయం చేస్తున్నారా? అని అడిగితే.. నో అని సమాధానం ఇచ్చింది. ఇలా నందమూరి ఫ్యామిలీ గురించి అడిగిన ప్రశ్నలన్నింటికీ అలేఖ్య సమాధానం ఇస్తూనే వచ్చింది.