ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల తల్లుల కోసం అమలవుతున్న “తల్లికి వందనం” కార్యక్రమానికి నేటితో (జూలై 2, మంగళవారం) చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తోంది. ఇవాళ సాయంత్రం వరకే ఆఖరి అవకాశం ఉన్నందున విద్యార్థుల తల్లులు అవసరమైన వివరాలు వెంటనే సమర్పించాలని అధికారులు సూచించారు. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, విద్యకు ప్రాధాన్యతనిస్తూ “తల్లికి వందనం” పథకాన్ని పునఃప్రారంభించింది. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించడం ప్రారంభమైంది. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, Aided, రెసిడెన్షియల్, మునిసిపల్, కార్పొరేషన్, ఆష్రమ్ స్కూళ్లు, గురుకులాలు, జాతీయ విద్యా సంస్థల విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడ్డారు.
మొత్తం లబ్ధిదారుల వివరాలు..
ఈ ఏడాది మొత్తం 43 లక్షల మంది తల్లులు “తల్లికి వందనం” పథకానికి అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందులో మొదటి విడతగా ఇప్పటికే చాలా మంది ఖాతాల్లో నగదు జమ అయింది. అయితే, కొన్ని లబ్ధిదారుల ఖాతాల్లో బ్యాంకు సమస్యల వల్ల డబ్బులు జమ కాలేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో, మరొకటో తరగతిలో చేరిన పిల్లల తల్లులకు మాత్రమే ఇవాళ సాయంత్రం వరకు అవకాశం కల్పించారు.
విద్యాశాఖ తాజా మార్గదర్శకాలు..
పదో తరగతి విద్యార్థుల కోసం ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో సుమారు 2.28 కోట్లు మంది తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమం కింద లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కేవలం నగదు రూపంలోనే కాకుండా, పిల్లల విద్యాభ్యాసంపై తల్లుల ఉత్సాహాన్ని పెంచే దిశగా ఉపయోగపడుతుంది. తల్లుల ఖాతాలో డబ్బు జమవడం ద్వారా వారి ప్రత్యక్ష సంబంధం పాఠశాలలతో ఏర్పడుతుంది. దీన్ని విద్యా నాణ్యతకు దోహదపడే ఒక సంస్కరణాత్మక చర్యగా భావిస్తున్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal