స్మార్ట్‌ఫోన్, టీవీలపై డిస్కౌంట్ ఎదురుచూస్తున్న వినియోగదారులకు గుడ్‌న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో సేల్‌కు సిద్ధమైంది. ఇటీవల ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సంస్థ.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) నిర్వహించనుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి, సాధారణ కస్టమర్లకు మధ్యాహ్నం నుంచి ఈ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి రానుంది.
ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఈ సేల్‌లో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపకరణాలు, అలెక్సా డివైజులపై డిస్కౌంట్లు అందివ్వనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇప్పటికే దీనికి సంబంధించి వెబ్‌సైట్‌లో బ్యానర్‌ను సిద్ధం చేసింది. మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం, ఫ్యాషన్ ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది. స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్లు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లపైనా డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది. ఆయా ప్రొడక్టల వారీగా ఆఫర్ల వివరాలను అమెజాన్ త్వరలో రివీల్ చేయనుంది. వినియోగదారులు ఈ లింక్‌పై క్లిక్ చేసి ఆఫర్ల వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు డిస్కౌంట్‌లో పొందొచ్చు :
ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ S24, ఐకూ 12, రెడ్‌మి నోట్ 13 ప్రో 5G, వన్‌ప్లస్ ఓపెన్, వన్‌ప్లస్ 12, రియల్‌మి నార్జో 70 ప్రో, ఐకూ నియో 9 ప్రో, రెడ్‌మి 13 5G, శాంసంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌లు సహా మరిన్ని బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్‌ను డిస్కౌంట్ ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా విమాన టికెట్ల బుకింగ్ పైన డిస్కౌంట్లను అందించనుంది. విమాన టికెట్లపై గరిష్ఠంగా 20 శాతం డిస్కౌంట్, హోటల్ బుకింగ్‌లపై 40 శాతం డిస్కౌంట్, దీంతోపాటు ట్రెయిన్ టికెట్లపై 100 శాతం రిఫండ్‌ను పొందొచ్చు. అలాగే.. మరికొన్ని మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, ఇతర గాడ్జెట్ట్‌లకు సంబంధించిన ఆఫర్లను త్వరలో ప్రకటించనున్నారు. అమెజాన్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
Amaravati News Navyandhra First Digital News Portal