విశాఖపట్నం: పాపం అనుకుని సాయం చేశారు.. చివర్లో ఇదేం ట్విస్ట్, ఈ నలుగురు పెద్ద ముదుర్లు

నలుగురు వ్యక్తలు రూ.500 నోటు ఇచ్చి చిల్లర ఉందా అని అడిగారు.. పోనీలే అని సాయం చేద్దామని.. రూ.500 నోటు తీసుకుని చిల్లర ఇచ్చారు. అయితే కొద్దిసేపటికి ఊహించని ట్విస్ట్‌తో చిల్లర ఇచ్చి సాయం చేసిన వాళ్లు అవాక్కయ్యారు.. సీన్ కట్ చేస్తే పెద్ద మోసమే జరిగింది. ఇలా అనకాపల్లి జిల్లాలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలంరేపింది. ఇద్దర్ని అమాయకుల్ని చేసి నకిలీ నోట్లు అంటగట్టారు నలుగురు యువకులు.

ఈ నెల 16న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరానికి చెందిన విశాల్, అతని మామయ్య శ్రీనుతో కలిసి ఓ వాహనంలో కొబ్బరి బొండాల లోడుతో విశాఖ వెళ్లారు. ఈ నెల 17న ఉదయం నగరంలోని ఎన్‌ఏడీ ప్రాంతంలోని ఓ షాపు దగ్గర కొబ్బరి బొండాల లోన్ అన్‌లోడ్‌ చేశారు. వీరిద్దరు అక్కడి నుంచి తిరిగి సొంత ఊరికి బయలుదేరి లంకెలపాలెం కూడలిలో సాయంత్రం 4.30 గంటల సమయంలో టీ తాగడానికి ఓ షాపు దగ్గర కొద్దిసేపు ఆగారు.ఇంతలో అనకాపల్లి మండలం విజయరామరాజుపేటకు చెందిన భానుప్రకాష్‌, యేడిద ఆదర్స్‌, పూడిమడక రోడ్‌ పెద్ద రెల్లివీధికి చెందిన హరిశ్చంద్రప్రసాదు, విజయనగరం జిల్లా రాజాం మండలం బూరాడకు చెందిన క్రాంతికుమార్‌ అక్కడికి వచ్చారు. ఈ నలుగురు విశాల్, శ్రీనులకు రూ.500 నకిలీ నోటు ఇచ్చి చిల్లర అడగడంతో పోనీలే సాయం చేద్దామని.. ఆ రూ.500 నోటు తీసుకుని రూ.వంద నోట్లు 5 ఇచ్చారు. వెంటనే మరో నాలుగు నకిలీ రూ.500 నోట్లు ఇచ్చి చిల్లర అడిగితే.. అవి కూడా తీసుకుని రూ.వంద నోట్లు 20 ఇచ్చారు. వెంటనే ఆ నలుగురు వ్యక్తు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

విశాఖ్, శ్రీనులకు ఆ నోట్లు నకిలీవని అనుమానం వచ్చింది.. వెంటనే పరిశీలించగా వాటిపై చిల్డ్రన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అని ఉండడంతో షాకయ్యారు. అప్పుడు తాము మోసపోయామని విశాల్, శ్రీను గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించారు.. వెంటనే పోలీసులు స్పందించి వారిద్దరితో కలిసి సమీప ప్రాంతాల్లో గాలించగా.. సాయంత్రం 6గంటల సమయంలో మంత్రిపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ దగ్గర నిందితులు కనిపించారు. వెంటనే నలుగుర్నిఅదుపులోకి తీసుకుని.. వారి దగ్గరు నుంచి రూ.500 నకిలీ నోట్లు 11, అసలు రూ.వంద నోట్లు 20 స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనకాపల్లి జిల్లాలో ఈ దొంగ నోట్ల వ్యవహారం కలకలంరేపింది. పోలీసులు ఈ నలుగుర్ని ప్రశ్నిస్తున్నారు.. ఈ నోట్ల వ్యవహారంపై పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. ఈ నకిలీ నోట్ల వ్యవహారానికి సంబందించి పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.

About amaravatinews

Check Also

ఇక విద్యార్థుల సెల్‌ఫోన్లకే పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు.. మంత్రి లోకేశ్‌ వెల్లడి

మనమిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ 2.0 వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానిస్తున్నట్లు మంత్రి లోకేష్‌ శాసనసభలో తెలిపారు. ఈ ఏఐ ఆధారిత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *