APలో కొత్త భూ రిజిస్ట్రేషన్ విలువ అమలు తేదీ వాయిదా.. ఎందుకంటే

APలో కొత్త భూ రిజిస్ట్రేషన్ విలువ అమలు తేదీ వాయిదా పడింది. వాస్తవానికి జనవరి 1 నుంచి నిర్ణయం అమలు చేయాలని భావించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే పలు వర్గాల నుంచి వచ్చిన వినతులతో అమలు తేదీ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని విషయంపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా 14వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించి, ప్రజాభిప్రాయం సేకరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. భూములకు ఉన్న డిమాండ్‌, ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదాలు తయారు చేయాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వ నిర్ణయంపై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు

ఏపీలో గత ఐదేళ్లలో భూముల మార్కెట్‌ రిజిస్ట్రేషన్‌ ధరలు పలుమార్లు పెరిగాయి. దీంతో పట్టణాల్లో రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరలకు సమానంగా చేరాయి. ఈ నేపథ్యంలో మరోసారి రిజిస్ట్రేషన్‌ ధరలు పెంచాలన్న నిర్ణయంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఛార్జీలు పెరుగుతాయన్న వార్తలతో భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు

సాధారణంగా ప్రభుత్వ లెక్కల్లో ఉండే భూమి విలువకు బహిరంగ మార్కెట్‌లో ఉండే విలువకు వ్యత్యాసం ఉంటుంది. ఈ విధానంలో భూమి కొనుగోలు చేసే వారికి తక్కువ ధరకు నివాస భూమి లభించడంతో పాటు అమ్మే వారికి లాభసాటిగా ఉండేది. ఈ విధానంలో ఆదాయాన్ని కోల్పోతున్నామని గుర్తించిన ప్రభుత్వం..రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచుకుంటూ పోతోంది. దీంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎలా ఉన్నా ప్రభుత్వానికి మాత్రం భారీగా ఆదాయం వస్తోంది. మరోవైపు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరుగుతాయన్న వార్తలతో..రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి.సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెబుతున్నారు అధికారులు.

About Kadam

Check Also

ఈ సారి భారతరత్న దక్కేది ఎవరికి? రేసులో ముందున్న ఆ ఇద్దరు..!

రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *