శుక్రవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. 2025-26కు సంబంధించి రూ.3,22,359 కోట్ల భారీ బడ్జెట్ ను రూపొందించారు. వాటిలో రాజధాని అమరావతికి ఎన్ని కోట్ల నిధులు కేటాయించారో ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. 2025-26కు సంబంధించి రూ.3,22,359 కోట్ల భారీ బడ్జెట్ ను రూపొందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులును ప్రస్తావిస్తూ వైసీపీపై విమర్శలు కూడా చేశారు.
బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ముందు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ నిర్వహించారు. కాగా, బడ్జెట్ సమావేశంలో రాజధాని అమరావతికి కేటాయించిన నిధులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమరావతికి ఆర్థిక మంత్రి రూ.6 వేల కోట్లు కేటాయించారు. తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని మరువలేనిదని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని, రాష్ట్రాభివృద్ధికి గ్రోత్ ఇంజనులా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమరావతితో పాటు ఏఏ రంగాలకు ఎన్ని కోట్ల నిధులు కేటాయించారో చూద్దాం..
- వ్యవసాయ బడ్జెట్ రూ.48 వేల కోట్లు
- పాఠశాల విద్యాశాఖ-రూ.31,806 కోట్లు
- బీసీ సంక్షేమం-రూ.23,260 కోట్లు
- వైద్యారోగ్య శాఖ-రూ.19,265 కోట్లు
- పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ-రూ.18,848 కోట్లు
- జలవనరుల శాఖ-రూ.18,020 కోట్లు
- పురపాలక శాఖ-రూ.13,862 కోట్లు
- ఇంధన శాఖ-13,600 కోట్లు
- రవాణాశాఖ-రూ.8,785 కోట్లు
- వ్యవసాయశాఖ-రూ.11,632 కోట్లు
- సాంఘిక సంక్షేమం కోసం రూ.10,909 కోట్లు
- ఆర్థికంగా వెనుకబడినవారి సంక్షేమంకోసం 10,619 కోట్లు
- అమరావతి నిర్మాణానికి రూ.6,000 కోట్లు
- రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు
- పోర్టులు, ఎయిర్‌పోర్టులు రూ.605 కోట్లు
- ఆర్టీజీఎస్‌కు రూ.101 కోట్లు
- ఐటీ, ఎలక్ట్రానిక్స్‌కు రాయితీలు రూ.300 కోట్లు
- NTR భరోసా పెన్షన్ రూ.27,518 కోట్లు
- ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు
- మనబడి పథకానికి రూ.3,486 కోట్లు
- తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు
- దీపం 2.O పథకానికి రూ.2,601 కోట్లు
- బాల సంజీవని పథకానికి రూ.1,163 కోట్లు
- చేనేత, నాయీబ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.3,377 కోట్లు
- స్వచ్ఛ ఆంధ్రకు రూ.820 కోట్లు
- ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు రూ.400 కోట్లు
- అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లు
- ధరల స్థిరీకరణ నిధి రూ.300 కోట్లు
- సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు
- పోలవరం నిర్మాణానికి రూ.6,705 కోట్లు
- జల్‌జీవన్ మిషన్‌కు రూ.2,800 కోట్లు
- రాష్ట్రీయ కృషి వికాస్ యోజన రూ.500 కోట్లు