గుడ్‌న్యూస్‌.. ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు అందేది ఆ నెల నుంచే..!

AP Budget 2025: ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి 48 వేల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. అలాగే పాఠశాల విద్యాశాఖ 31,806 కేటాయించింది. ఇక బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయించగా, వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది..

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ పథకాన్ని మే నెల నుంచి అమలు చేయనున్నట్లు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు వారి తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తించనున్నట్లు చెప్పారు.

విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్నట్లు బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించింది.  స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు బడ్జెట్‌ సమావేశంలో మంత్రి ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్దెట్టులో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ సిక్స్ సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025-26 బడ్జెట్లో పెద్ద పీట వేసింది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు ప్రకటించింది.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకంపై..

అలాగే ఎటువంటి జాప్యం లేకుండా.. కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్‌లో ప్రస్తావించారు. ఈ ఏడాదిలోనే రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్లు మంత్రిర చెప్పారు.

ఎన్టీఆర్‌ వైద్య సేవలు కొనసాగింపు..

ఇక రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు మంత్రి బడ్జెట్‌లో వెల్లడించారు

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. చేనేతలకూ ఉచిత విద్యుత్ అమలు చేయనున్నామన్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్ల మేర ఉచిత విద్యుత్, మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నామన్నారు. అలాగే నాయీ బ్రహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం అందించనున్నామని తెలిపారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రామాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

7 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు:

ఇక ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్టులో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం నిమిత్తం ఎస్సీలకు అదనంగా రూ. 50 వేలు, ఎస్టీలకు అదనంగా రూ. 75 వేలు ఇవ్వనున్నట్టు బడ్జెట్‌లో వెల్లించారు.

మత్స్యకారుల సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంపు:

ఇక ఈ బడ్జెట్‌లో రాష్ట్ర మత్స్య కారులకు గుడ్‌న్యూస్ అందించారు. చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే దీపం 2.0 కింద నిధుల కేటాయించారు. ఆదరణ పథచాన్ని పునః ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

About Kadam

Check Also

10వ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షా ఫలితాల విడుదలపై ప్రకటన వచ్చేసింది..

ఏపీ స్టేట్ ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి ఓ ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఇది విద్యార్థుల జీవితాల్లో మలుపు తిప్పే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *