సంక్రాంతి పండగవేళ సీఎం చంద్రబాబు ఆగ్రహం.. సొంత గ్రామంలో సీరియస్

Chandrababu: సంక్రాంతి పండగ సందర్భంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం తమ సొంత గ్రామం అయిన తిరుపతి జిల్లా నారావారిపల్లెకు చేరుకున్నారు. 3 రోజుల పాటు అక్కడే ఉండనున్న చంద్రబాబు కుటుంబం.. నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన వివిధ పోటీలు, ఉత్సవాలు చూసేందుకు సీఎం కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నారావారిపల్లెలో 33కేవీ సెమీ ఇండోర్‌ సబ్ స్టేషన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో 20 ఇళ్లకు సోలార్‌ రూఫ్‌టాప్‌ పలకలు అమర్చినట్లు నెడ్‌క్యాప్‌ అధికారులు సీఎంకు వివరించారు. అయితే రాష్ట్రంలో పీఎం సూర్యఘర్‌ పథకాన్ని అమలు చేస్తున్నాం కదా.. ఎస్సీ, ఎస్టీలు ఒక్క పైసా చెల్లించకుండానే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చంద్రబాబు చెప్పారు. అయితే దాని గురించి చెప్పాలని సీఎండీ సంతోషరావును సీఎం అడిగారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం రాయితీ అని సీఎండీ సంతోషరావు చెబుతుండగా చంద్రబాబు మధ్యలో కలగజేసుకున్నారు.

విను విను అంటూ ఈ పీఎం సూర్యఘర్ పథకం గురించి వివరించారు. 2 కిలోవాట్ల వరకు రూ.60 వేల మేర కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందని తెలిపారు. అదనంగా మరో రూ.55 వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక ఆ సోలార్ రూఫ్‌టాప్‌ల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వినియోగదారులు వాడుకోవచ్చని చెప్పారు. అంతేకాకుండా మిగులు విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేసుకోవచ్చని.. ఇంకా ఆలోచించుకోకుండా పోతే ఎలా అని ఈ సందర్బంగా సీఎండీపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

About amaravatinews

Check Also

Bank Holiday: జనవరిలో ఆ రోజు కూడా సెలవే.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రోజు సెలవు ఇచ్చింది. కనుమ పండుగను కూడా సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *