ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన గౌరవం.. బీజేపీ సీఎంలను పక్కన పెట్టి మరీ..!

Chandrababu: హర్యానాలో బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార మహోత్సవం.. చండీగఢ్‌లోని పంచకుల పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. వీరితోపాటు 18 ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏలో కింగ్ మేకర్‌గా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. బీజేపీ అరుదైన గౌరవాన్ని కల్పించింది. వేదికపై ఏర్పాటు చేసిన సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో చంద్రబాబుకు గౌరవం ఇచ్చింది.

హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు.. ఎన్డీఏ కూటమిలో ఉన్న ఇతర పార్టీలకు చెందిన సీఎంలు కూడా హాజరయ్యారు. బీజేపీ సీఎంలైన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సహా పలువురు బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. మరోవైపు.. ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సహా పలువురు సీఎంలు హాజరయ్యారు. అయితే వీరెవరికీ దక్కని అరుదైన గౌరవం.. నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారంలో చంద్రబాబుకు దక్కడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో కీలక నేతలు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా.. మరో కేంద్రమంత్రి అమిత్ షా మధ్యలో చంద్రబాబుకు సీటును కేటాయించారు.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *