వడ్డీ రేట్లు యధాతథం.. రెపోరేటు 6.50 శాతంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించిన గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష నిర్వహించింది. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయని ఆర్​బీఐ, రెపోరేటు 6.50 శాతంగా కొనసాగిస్తున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వసారి.

దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని 4.50 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా బ్యాంకులు వృద్ధిని వేగవంతం చేయడానికి మరింత ఎక్కువ రుణాలను పంపిణీ చేయగలవని భావిస్తున్నారు. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం రూ.1.16 లక్షల కోట్ల నగదును పెంచడంలో దోహదపడుతుంది.

RBI ఖరీదైన EMI నుండి ఉపశమనం ఇవ్వలేదు. సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ రేటులో అంటే రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగుతోందని, ఫిబ్రవరి 2023 నుండి రెపో రేటులో ఎటువంటి మార్పు లేదని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వసారి. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు ఈ రేటును ఇలాగే కొనసాగిస్తూ వస్తోంది.

క్యాష్ రిజర్వ్ రేషియోలో 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. CRR – 4.50 శాతం నుండి 4 శాతానికి తగ్గించారు. నగదు నిల్వల నిష్పత్తి తగ్గింపును రెండు దశల్లో అమలు చేయనున్నారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1.16 లక్షల కోట్ల అదనపు నగదు అందుబాటులోకి వస్తుంది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశం డిసెంబర్ 4న ప్రారంభం కాగా, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం(డిసెంబర్ 6) ప్రకటించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, వృద్ధిని కొనసాగించడంతోపాటు ధరలను స్థిరంగా ఉంచడమే మా లక్ష్యం అని ఆర్‌బిఐ గవర్నర్ అన్నారు. అదే సమయంలో వృద్ధిని కొనసాగించడం ముఖ్యమని, ఇది ఆర్‌బిఐ చట్టంలో కూడా ఉందన్నారు.

జిడిపి వృద్ధి రేటు క్షీణతపై ఆర్‌బిఐ గవర్నర్ మాట్లాడుతూ, ఆర్థిక వృద్ధి రేటు క్షీణతకు కారణం పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పారిశ్రామిక వృద్ధిరేటు 7.2 శాతం కాగా, రెండో త్రైమాసికంలో 2.1 శాతానికి తగ్గింది. తయారీ రంగం వృద్ధి రేటు తగ్గిందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పెరిగిందని, అయితే పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ తగ్గుతోందని ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు.

ఆర్‌బీఐ వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో, ఆర్‌బిఐ జిడిపి వృద్ధి రేటు 6.6 శాతంగా అంచనా వేసింది. ఇది అంతకుముందు 7.2 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జీపీపీ వృద్ధి రేటు 6.6 శాతంగా, నాల్గవ త్రైమాసికంలో 6.8 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది.

About Kadam

Check Also

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎప్పుడంటే..?

భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య మరింత బంధం బలపడనుంది. రెండు భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కానున్నాయి. ఫ్రెంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *