ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖకు సంబంధించి రెండు అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల గురించి ఆరా తీశారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఈ రెండు కార్లను స్వాధీనం చేసుకోగా.. అవి మాయం అయ్యాయి. ఈ కార్లలో ఒకటి 2017 నవంబరులో అప్పటి అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాముకు కేటాయించగా.. ఆ తర్వాత ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆ కారు ఏమైందో ఎవరికి తెలియకపోవడం విశేషం.. ఎవరి దగ్గర ఉంది.. ఎవరు వినియోగిస్తున్నారనేది కూడా తెలియదు. అధికారులు తమకు తెలియని చెబుతున్నారు. ఈ మేరకు ఈ కారు ఏమైందో, ఎక్కడుందో తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి కార్యాలయం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దీనిపై నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్‌ను ఆదేశించారు.2017లో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలో క్రైమ్ నంబర్ 414/2017 నమోదు కాగా.. ఈ కేసులో ఓ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి టీఎన్ 05 బీహెచ్ 3303 నంబరు బీఎండబ్ల్యూ కారును అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే 2017 డిసెంబర్ 11న కాన్ఫిస్‌కేట్ (ప్రభుత్వం స్వాధీనం) కాకముందే ఆ వాహనాన్ని అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనంతరాముకు కేటాయిస్తూ.. అప్పటి అటవీ దళాల అధిపతి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 జూన్ వరకూ ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగారు. అనంతరాము అనంతరం 2019 జూన్ నుంచి 2020 అక్టోబరు.. 2022 ఫిబ్రవరి నుంచి 2024 జూన్ వరకూ ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
Check Also
ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు జమ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. గత ఐదేళ్లుగా …