ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ పథకాన్ని అమలు చేసే అంశాలపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేయాలా.. సెర్ప్ (పేదరిక నిర్మూలన సొసైటీ) ద్వారా అమలు చేయాలా అనే అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు రెండు విధానాలు ప్రభుత్వం దగ్గరకు వచ్చాయి. సెర్ప్ ద్వారా విధానం అమలు చేయాలా?.. గ్రామ, వార్డు సచివాయాల ద్వారా అమలు చేయాలా అనే రెండు ఆప్షన్లను పరిగణలోకి తీసుకుంది.
2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం.. ఈ పథకాన్ని సెర్ప్ పరిధిలో అమలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఏడాదికి దాదాపుగా 85 వేల క్లెయిమ్‌లను పరిష్కరించారు.. నెల రోజుల్లోనే రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని ఈ విధానంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు అందజేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది.. బీమా మిత్రలను తొలగించి పథకం విధి విధానాల్లో మార్పులు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి సుమారు 25 వేల క్లెయిమ్‌లను మాత్రమే పరిష్కరించారనే విమర్శలు ఉన్నాయి.
2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం బీమా మిత్రల ద్వారా పథకాన్ని అమలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా వ్యక్తి చనిపోతే వారి వివరాలను రెండు గంటల్లోనే రిజిస్ట్రేషన్ చేసి.. ఆరు గంటల్లో బాధిత కుటుంబం దగ్గరకే బీమా మిత్రలు వెళ్లి మట్టి ఖర్చుల కింద రూ.5,000 చెల్లించే విధానం ఉండేది. అనంతరం రెండు రోజుల్లో బీమా వర్తింపునకు సంబంధించిన అన్ని వివరాలనూ నమోదు చేసి నెల రోజుల్లో ఆర్థిక సాయం అందించేవారు. ఈ విధానంలో ఒక్కో క్లెయిమ్ నమోదు చేసినందుకుగాను బీమా మిత్రలకు రూ.250 నుంచి రూ.500 చొప్పున చెల్లించేవారు. అయితే ఈ సర్వీసు ఛార్జీ కింద ప్రజల నుంచి సేకరించిన సొమ్ముతోనే బీమా మిత్రలకు చెల్లింపులు జరిగేవి.ఈ బీమా మిత్రల విధానంతో అదనపు ఆర్థికభారం ఏమీ పడబోదని కూటమి ప్రభుత్వనికి నివేదించారు అధికారులు. మరోవైపు చంద్రన్న బీమా పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే కార్మికశాఖ మరో ప్రతిపాదన చేసింది. బీమా పథకాన్ని గ్రామ, వార్డు సచివాలయశాఖ ద్వారా అమలు చేయాలని.. కాకపోతే సచివాలయాల ద్వారా కొన్ని సమస్యలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.