ఏపీలో వారందరికి బిగ్ అలర్ట్.. ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తారు, మరో రూ.2లక్షలు కూడా.. వివరాలివే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతి వృత్తిదారులకు కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తిస్తుంది. 2023-24 ఆగస్టు వరకు దరఖాస్తులు స్వీకరించి అర్హుల్ని గుర్తించారు. రెండో విడత జాబితాలో దరఖాస్తులకు సంబంధించి సర్వే చేయాల్సి ఉంది. కొన్ని అనర్హుల దరఖాస్తులను తిరస్కరించారు. ఈ మేరకు , సచివాలయ సంక్షేమ కార్యదర్శులు, నోడల్‌ అధికారులు, మెప్మా కమ్యూనిటీ అర్గనైజర్ల ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే పూర్తి చేసిన తర్వాత కలెక్టర్‌కు వివరాలు నివేదించి లబ్ధిదారుల తుది జాబితాకు ఆమోదం తెలియజేయనున్నారు.

కేంద్రం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద 18 రకాల చేతి వృత్తిదారులను అర్హులుగా గుర్తించారు. వీరిలో స్వర్ణకారులు, శిల్పకారులు, తాపీ పనివారు, వడ్రంగులు, వలలు, బోట్ల తయారీ, పాదరక్షలు తయారు చేసే చర్మకారులు, కలంకారీ, బొమ్మల తయారీ, రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలు, కమ్మరి, బుట్టలు, అల్లికలు వంటి వారు ఉన్నారు.

ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు రూ.15వేలు విలువైన పరికరాలను ఉచితంగా అందిస్తారు. అనంతరం సక్రమంగా వృత్తి పని చేసే వారికి 5శాతం వడ్డీకి ఒక్కొక్కరికి రూ.2.లక్షల చొప్పున బ్యాంకు రుణాలు కూడా ఇస్తారు. ఈ మేరకు వారికి నైపుణ్య శిక్షణ ఇస్తారు. జిల్లా యంత్రాంగం అత్యాధునిక సాంకేతిక అంశాలపై విభాగాల వారీగా నైపుణ్య శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది.
18 రకాల కులవృత్తులకుఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తూ.. ప్రతి రోజూ రూ.500 ఇస్తారు. అలాగే మధ్యాహ్న భోజనం అందిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందిస్తారు. అర్హత ఉన్నవారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే.. పరిశీలించి లబ్ధిదారుల్ని గుర్తిస్తారు. ఈ మేరకు తుది జాబితాను సిద్ధం చేస్తారు.

ఏపీ ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజనతో ఆదరణ పథకాన్ని అనుసంధానించి అమలుచేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం పీఎం విశ్వకర్మ యోజన కింద చేతివృత్తిదారులకు పరికరాల కొనుగోలుకు రూ.15వేలు, శిక్షణకు రూ.4వేల ఇస్తుండగా.. ఈ మొత్తం పరికరాల కొనుగోలుకు సరిపోదు కాబట్టి.. రాష్ట్రప్రభుత్వం తన వాటాగా మరికొంత అందించి అమలుచేసేలా అధికారులు పథకాన్ని రూపొందించారు. ‘ఆదరణ-విశ్వకర్మ యోజన’గా పేరుపెట్టారు. ఈ పథకంలో ఎంపికచేసిన వారికి.. రెండు విడతల్లో రూ.3లక్షలు బ్యాంకుల ద్వారా రుణం కూడా ఇప్పిస్తారు. ఈ రుణాలకు బ్యాంకులు విధించే 13% వడ్డీలో కేంద్రం 8% భరిస్తుంద.. మిగతా 5% లబ్ధిదారులు చెల్లించాలి. అయితే రాష్ట్రప్రభుత్వమే ఆ 5% భరించేలా ప్రతిపాదన సిద్ధం చేసింది. ఈ మేరకు లబ్ధిదారులకు సున్నావడ్డీ కిందే రుణం అందనుంది. రాష్ట్రప్రభుత్వం బ్యాంకులిచ్చే రూ.3 లక్షల రుణంలోనూ కొంత మొత్తాన్ని రాయితీగా అందించే ప్రతిపాదన ఉంది.

About amaravatinews

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *