Bank Holiday: జనవరిలో ఆ రోజు కూడా సెలవే.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రోజు సెలవు ఇచ్చింది. కనుమ పండుగను కూడా సాధారణ సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీలోని బ్యాంకు ఉద్యోగులకు ఒక రోజు సెలవు ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజు మాత్రమే సెలవు ఇచ్చారు. డిసెంబర్‌లో విడుదల చేసిన 2025 ప్రభుత్వ సెలవుల జాబితాలో.. ఏపీలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు జనవరి 14 మాత్రమే సెలవు ఇచ్చారు, అయితే జనవరి 15న అంటే కనుమ రోజు కూడా సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి.

ఈ విషయమై యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. బ్యాంకు ఉద్యోగుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం.. జనవరి 15న కూడా బ్యాంకు ఉద్యోగులకు సెలవుగా ప్రకటించింది. ఈ మేరకు డిసెంబర్‌లో జారీ చేసిన జీవో నంబర్ 2116కు సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తాజాగా జీవో నంబర్ 73 విడుదల చేశారు. మరోవైపు సంక్రాంతి పండగకు విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం పదిరోజులు సెలవులు ఇచ్చింది. జనవరి 10 నుంచి 19 వరకూ సంక్రాంతి సెలవులు ఇచ్చారు. జనవరి 20న తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

About amaravatinews

Check Also

రానున్న 24 గంటల్లో కుండపోత వాన.. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *