ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్టులపై కసరత్తు జరుగుతోంది. కొత్తగా మరో ఏడు విమానాశ్రయాల కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో భూముల్ని వెతికే పనిలో ఉన్నారు అధికారులు. అయితే నెల్లూరు జిల్లాలో విమానాశ్రయంపై ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.. దగదర్తిలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో దగదర్తి విమానాశ్రయ ప్రతిపాదనను పక్కన పెట్టగా.. కూటమి ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం పస్తుత ధరల ప్రకారం కొత్త డీపీఆర్‌లను సిద్ధం చేయాలని.. రెండు నెలల్లో టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించింది.
ప్రభుత్వం ధరల పెరుగుదల కారణంగా.. కొత్త ధరలతో అంచనాలు తయారు చేయాలని అధికారులకు సూచించింది. దగదర్తి సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి భూములు అందుబాటులో ఉన్నాయి.. అంతేకాదు ఏఏఐ (ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) అన్ని అనుమతులు ఇవ్వడంతో కాంట్రాక్ట్ సంస్థను ఎంపిక చేయగానే పనులు ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.
Amaravati News Navyandhra First Digital News Portal