ఏపీలో రైతుల అకౌంట్‌లలో డబ్బులు.. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేశాయి

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ. 5,78,18,000 అందజేసేందుకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదాన్ని తెలిపారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీచేసింది.. జులైలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఉద్యానపంటల రైతులు 8,376 మంది నష్టపోయారని గుర్తించారు.. బాధిత రైతులకు డీబీటీ కింద ఇన్‌పుట్‌ సబ్సిడీ అందజేయాలని సిసోడియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు ఏపీలో జులైలో కురిసిన భారీవర్షాలకు దెబ్బతిన్న ఎండీఆర్‌ (జిల్లా ప్రధాన రహదారులు), రాష్ట్ర హైవేల మరమ్మతులు, ప్యాచ్‌వర్క్‌ల కోసం ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. ఈ మేరకు రూ.290.40 కోట్లు విడుదల చేశారు.. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నుంచి ఈ నిధులు కేటాయించారు. ఉద్యానపంటలు నష్టపోయిన 8,374 మంది రైతులకు పెట్టుబడి రాయితీకి రూ.5.78 కోట్లు విడుదల చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి.సిసోడియా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

అంతేకాదు ఇటీవల కురిసన వర్షాలతో పంటలు నష్టపోయినవారికి సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. హెక్టారు పత్తికి రూ.25వేలు, వేరుశనగకు , హెక్టార్‌ ఫిషింగ్‌ ఫామ్‌ డీసిల్టేషన్, రెస్టిరేషన్‌కు రూ.15వేలు, పసుపు, అరటికి రూ.35వేల చొప్పున సాయం. మొక్క జొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కష్టాలలో ఉన్న ప్రజలకు సాయంగా నిలబడాలనే ఉద్దేశ్యంతో బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నామన్నారు. బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ ఏజెన్సీల ద్వారా కూడా మంచి సాయం అందేలా చేస్తున్నామని.. మత్స్యకారుల బోట్లకు, చేనేత కార్మికులకు, పశువుల కోల్పోయిన రైతులకు కూడా పరిహారం అందిస్తున్నామన్నారు. వరద సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్నీ పరిశీలించి ఈ ప్యాకేజీని ప్రకటించామన్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు చెల్లించే పరిహారాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. ఏపీ కేబినెట్ సమావేశంలో వరద సాయానికి ఆమోదం తెలిపారు. అంతేకాదు చిరు వ్యాపారులకు గతంలో రూ.5 వేల చొప్పున ఇచ్చే నష్ట పరిహారాన్ని ఏకంగా రూ.25 వేలకు పెంచడం ఊరట కలిగించింది.

About amaravatinews

Check Also

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *