ఏపీ అన్న క్యాంటీన్లలో రోజు వారీ మెనూ ఇదే.. టైమింగ్స్‌తో సహా వివరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో పేదలకు రూ.5కే రుచికరమైన భోజనం అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 15న (గురువారం) అన్న క్యాంటీన్‌ను కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. ఈ నెల 16న మిగిలిన 99 క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు. ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లలో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి. ముందుగా వంద క్యాంటీన్లకు భోజనం సరఫరా చేయనున్నారు. మిగిలిన వాటికి ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు 5న ప్రారంభించనున్నారు.

అన్న క్యాంటీన్లకు సంబంధించి మెనూ వచ్చేసింది. అక్కడ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందుబాటులో ఉంచుతారు. వారంలో ఆరు రోజులు ఈ క్యాంటీన్లు నడుస్తాయి.. ఆదివారం మాత్రం సెలవు దినం. టిఫిన్, భోజనం రూ.5కే అందిస్తారు. అన్న క్యాంటీన్లలో మెనూ ఇలా ఉంటుంది..

సోమవారం మెనూ

బ్రేక్ ఫాస్ట్ రూ.5

ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా

లంచ్/డిన్నర్ రూ.5

వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి

మంగళవారం మెనూ

బ్రేక్ ఫాస్ట్

ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్

లంచ్/డిన్నర్

వైట్ రైస్, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి

బుధవారం మెనూ

బ్రేక్ ఫాస్ట్

ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్

లంచ్/డిన్నర్

వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు పచ్చడి

గురువారం మెనూ

బ్రేక్ ఫాస్ట్

ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా

లంచ్/డిన్నర్

వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి

శుక్రవారం మెనూ

బ్రేక్ పాస్ట్

ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్

లంచ్/డిన్నర్ట్ రైస్, కూర, పప్పు/

వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి

శనివారం మెనూ

బ్రేక్ ఫాస్ట్

ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబారు లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబారు, మిక్చర్

లంచ్/డిన్నర్

వైట్ రైస్, కూర, పప్పు/సాంబారు, పెరుగు, పచ్చడి

About amaravatinews

Check Also

నెల్లూరు సమీపంలో వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో ఉన్నది చూసి షాక్..!

నెల్లూరు సమీపంలో వెళ్తున్న ఓ వ్యాన్‌ను ఆపిన అధికారులు.. అందులో తరలిస్తున్న వస్తువులు చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే చైనా నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *