ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతల సిఫార్సులతో ఏపీఎండీసీ (ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ)లో ఎడాపెడా ఉద్యోగాలు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారికి ఆ శాఖ ఎండీ చెక్‌ పెట్టారు. పొరుగుసేవల కింద పనిచేస్తున్న 45 మందిని.. అంతేకాదు కాంట్రాక్టు విధానంలో తీసుకున్న 50 మందిని తొలగించారు. ఈ మేరకు ప్రభుత్వం మొత్తం 95 మంది పొరుగుసేవలు, కాంట్రాక్టు ఉద్యోగుల తొలగించారు.

ఈ 95మందికి ఐదేళ్లపాటు జీతాలు చెల్లించడంతో ఏపీఎండీసీపై అదనపు భారం పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి వివరాలపై ఆరా తీశారు. ఆ వెంటనే వీరికి చెక్‌ పెట్టడం ప్రారంభించారు. ఈ ఉద్యోగుల కాంట్రాక్టు కాలం జూన్‌ తర్వాత నుంచి ముగిసినా.. వారి కాంట్రాక్టు మళ్లీ పొడిగించలేదు. ఈ మేరకు అలా దాదాపు 150 మంది ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు. గడువున్న ఉద్యోగుల్లో 65 మందిని కూడా తాజాగా తొలగించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ 95మందిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ (ఏపీఐటీఏ)ని రద్దు చేసింది. అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఏపీఎస్‌ఎస్‌డీసీ (ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీఎస్‌ఎస్‌డీసీకు చెందిన ఆస్తులు, రికార్డులను నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీఐటీఏ ఎండీ, ఏపీఎస్‌ఎస్‌డీసీ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *