ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. డిసెంబర్‌లో పక్కా, రెడీగా ఉండండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనుంది. ఈ నెల 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా.. 184 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేస్తారు. సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావించినా.. వరదల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. పాఠశాల, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ, విశ్వవిద్యాలయాలు, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ అద్యాపకులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేయనున్నారు. విజయవాడలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు.

మరోవైపు నారా లోకేష్ పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై సమీక్ష చేశారు. ఈ నెల 11న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనున్నామన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలని నిర్ణయించామన్నారు. డిసెంబరు మొదటి వారంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహిస్తామన్నారు. వాస్తవానికి ఈ నెలలోనే సమావేశం నిర్వహించాలని భావించారు.. కానీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. విద్యార్థులకు సైన్స్‌ ఫేర్, క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. అంతేకాదు విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు అవసరమైన కిట్లు అందించాలి అన్నారు. అంతేకాదు రాష్ట్రం మొత్తాన్ని నాలుగు జోన్లుగా విభజించి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాదు మండలానికో జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. అంతేకాదు డీఎస్సీలో సాధ్యమైనంత ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి లోకేష్.

మరోవైపు ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఆన్సర్ షీట్లను ఏఐ ద్వారా మూల్యాంకనం చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి లోకేష్ సూచించారు. ప్రభుత్వ కాలేజీల్లో చదివి జేఈఈ, నీట్‌ లాంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫొటోలు న్యూస్ పేపర్లలో ప్రచురించాలి అన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్‌ ఫస్టియర్ ఎన్‌సీఈఆర్టీ పుస్తకాలు ప్రవేశపెట్టడంతో పాటు ప్రశ్నాపత్రంలో మార్పులు చేయనున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు.

About amaravatinews

Check Also

ఆ విశ్వవిద్యాలయం విధుల్లో కొత్త సెక్యూరిటీ గార్డు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. !

అది 2002 సంవత్సరం… ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కోతుల గుంపు తిరుగుతుండేది. చుట్టూ పక్కల అంతా వ్యవసాయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *