ఏపీలో పింఛన్ డబ్బులు ఒకరోజు ముందుగానే ఇస్తారు.. కారణం ఇదే, ఈ నెల నుంచి మరో కొత్త రూల్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్‌ను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేస్తోంది. కానీ ఒకటో తేదీన సెలవు అయితే మాత్రం ముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 1 ఆదివారం కావడంతో పింఛన్ డబ్బుల్ని ఒక రోజు ముందుగానే.. అంటే నవంబర్ 30వ తేదీనే పంపిణీ చేయనున్నారు. పింఛన్ తీసుకునేవారు ఈ విషయాన్ని గమనించాలన్నారు అధికారులు.

అంతేకాదు 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో.. రెండో తేదీన మిగతా (పెండింగ్) పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ఒకవేళ రెండో తేదీన కూడా సెలవు ఉంటే.. ఆ మరుసటి రోజు (3వ తేదీ) పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ప్రతి నెలా 1న సెలవు దినం వస్తే సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు నెలలో పింఛన్ తీసుకోకపోతే మూడో నెలలో కలిపి మొత్తం పింఛన్ డబ్బులు (మూడు నెలలు కలిపి) ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నెల నుంచే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *