ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు త్వరలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వచ్చే కేబినెట్ సమావేశంలో రేషన్ కార్డుల అంశంపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో కొత్తగా రేషన్‌ కార్డుల జారీ, పౌర సరఫరాల శాఖలో ఇతర సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. కొత్త రేషన్‌ కార్డుల మంజూరు, కుటుంబాల విభజన, కుటుంబ సభ్యుల చేర్పు, కుటుంబ సభ్యుల తొలగింపు, అడ్రస్ మార్పు, కార్డులను సరెండర్‌ చేయనున్నారు.

రాష్ట్రంలో వాహనాల ద్వారా రేషన్‌ సరకుల పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై చర్చించనున్నారు. అంతేకాదు రాష్ట్రంలో 6 వేల రేషన్‌ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతో పాటుగా.. కొత్తగా 4 వేలకు పైగా షాపులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం.. నెలవారీ ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలకు మించితే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, ఆ కుటుంబాలు రేషన్‌ కార్డుకు అనర్హులని ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధనతో రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, పొరుగు సేవల ఉద్యోగుల కార్డులు రద్దయ్యాయి.

ఈ నిబంధనతో అంగన్‌వాడీ కార్యకర్తలు, పొరుగు సేవల ఉద్యోగుల కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు దూరం అయాయి. తమకు వచ్చేదే తక్కువ జీతమని, రేషన్‌ కార్డుల తొలగింపు వల్ల నష్టపోతున్నామని వీరంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కుటుంబ ఆదాయ పరిమితిని పెంచి, కొత్తగా కార్డులు జారీ చేయాలని వీరు కోరుతున్నారు. ఈ అంశంపైనా కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన ధాన్యం బకాయిలు రూ.1,674.40 కోట్లు చెల్లించింది. తొలి విడతగా రూ.వెయ్యి కోట్లు.. తర్వాత రెండో విడతగా రూ.674.40 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది.

About amaravatinews

Check Also

ఆంధ్రప్రదేశ్‌పై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. నైరుతి , ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *