ఏపీలో ఆ ఉద్యోగులందరూ తొలగింపు.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎండీసీ (ఖనిజాభివృద్ధి సంస్థ)లో మరోసారి ఉద్యోగుల్ని తొలగించారు. గత ప్రభుత్వం (2019-2024) మధ్య పొరుగుసేవలు, కాంట్రాక్ట్‌ విధానంలో సిఫార్సులతో చేరిన మరో 90 మందిని తొలగిస్తూ ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో ఉద్యోగుల్ని చేర్చుకున్నారు. అప్పటి గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు, పలువురు ప్రజా ప్రతినిధు సిఫార్సులతో వందల మంది ఉద్యోగులు చేరారు. 2019లో ఏపీఎండీసీ ఇసుక వ్యాపారం చేసినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 మందిని ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.

ఆ తర్వాత ఏపీఎండీసీ ఇసుక వ్యాపారం నుంచి జేపీ సంస్థకు అప్పగించిన తర్వాత.. వారిలో కొందరు ఉద్యోగుల్ని తొలగించారు. వీరిలో మరికొందర్ని ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో ఏపీఎండీసీలో కొనసాగించారు. వీరితో పాటుగా అప్పటి పెద్దలు సూచించిన వారిని ఏపీఎండీసీలో వివిధ క్యాడర్లలో ఉద్యోగులుగా నియమించారు. వీరు గత ఐదేళ్ల పాటూ ఉద్యోగాల్లో కొనసాగారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్‌ గడువు ముగియడంతో.. వాళ్లను మళ్లీ రెన్యువల్‌ చేయకపోవడంతో వారిని కొంతమంది ఉద్యోగాల నుంచి వెళ్లిపోయారు.

ఇంకా ఏపీఎండీసీలో కొందరు మిగిలి ఉండటంతో ఇప్పటికే రెండు దఫాలుగా ఇప్పటి వరకు దాదాపుగా 150 మందిని తొలగించారు. తాజాగా ప్రభుత్వం ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం, మంగంపేట ముగ్గురాయి, చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌ ప్రాజెక్టులో పనిచేస్తున్న మిగిలిన 90 మందిని తొలగించింది. తాజాగా తొలగించిన ఉద్యోగుల్లో ఇద్దరు, ముగ్గురు దాదాపు పదేళ్లకుపైగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే వీరిని మానవ వనరుల విభాగం ఉద్దేశపూర్వకంగా 2019-24 ఉద్యోగుల జాబితాలో చూపించి.. తొలగించేలా చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తీసుకున్నట్లుగా వందల మందిని కాకుండా.. అవసరమైన మేరకు మాత్రమే పరిమితంగా కొందరు ఉద్యోగులను పొరుగుసేవల కింద తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

About amaravatinews

Check Also

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఆ పేపర్లపై హాల్‌టికెట్లు ప్రింట్‌ తీస్తే అనుమతి రద్దు: ఇంటర్‌ బోర్డు

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే కొందరు విద్యార్ధులు ఫోన్‌కే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *