ఏపీలో కాలేజీలకు సీరియస్ వార్నింగ్.. రూ.15 లక్షలు జరిమానా, విద్యార్థులకు పండగే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం.. నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయంది ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ హెచ్చరించింది. అలా నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధించే అధికారం కమిషన్‌కు ఉందని గుర్తు చేశారు.

కొన్ని విద్యా సంస్థలు కోర్సు పూర్తైనా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని.. ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్న ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని తమకు ఫిర్యాదులు వస్తున్నాయంటున్నారు. ఇలా చేయడం విద్యార్థుల చదువులు, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తాయి అని గుర్తు చేశారు. ఇలాంటి విద్యాసంస్థలకు జరిమానా, గుర్తింపు రద్దుచేసేందుకు యూనివర్శిటీకి సిఫార్సు చేసే అధికారం కమిషన్‌కు ఉందని తెలిపారు యూజీసీ నిబంధనల ప్రకారం ఒరిజినల్‌ సర్టిఫికెట్లను విద్యాసంస్థలు తీసుకోకూడదు అన్నారు. ఒకవేళ విద్యార్థులకు సమస్యలు ఉంటే ఫోన్‌ నంబర్లు 87126 27318, 08645-274445లకు ఫిర్యాదు చేయొచ్చని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ తెలిపింది.

మరోవైపు రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలుపై శాసనమండలిలో మంత్రి స్పందించారు. ఇకపై కాలేజీల యాజమాన్యాల బ్యాంక్ అకౌంట్‌లకే ఫీజు రీయింబర్స్‌మెంట్ జమ చేస్తామని చెప్పారు.‌ గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ తల్లుల అకౌంట్‌లలో జమ చేసే విధానం తీసుకొచ్చిందని.. కానీ వారికి ఫీజులు చెల్లించలేదన్నారు. తల్లి బ్యాంక్ అకౌంట్‌లో, ఆ తర్వాత తల్లి-విద్యార్థి జాయింట్‌ అకౌంట్‌లో డబ్బులు జమ చేయడంతో ఇబ్బందులు పడ్డారన్నారు. ఇకపై ఈ విధానానికి గుడ్ బై చెప్పామని.. గతంలో ఉన్న విధానాన్ని మళ్లీ అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు విడతల వారీగా ఫీజుల బకాయిలు కాలేజీలకు చెల్లిస్తామని.. అలాగే రాష్ట్రంలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. గత ప్రభుత్వం మెస్‌ ఛార్జీలు, ట్యూషన్‌ ఫీజులు సరిగా చెల్లించలేదని.. విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు.

About amaravatinews

Check Also

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రాకు ఇంకా వర్షాలు వీడలేదు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. కోస్తా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *