ఏపీలో నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ప్రభుత్వమే ఉచితంగా, మంత్రి కీలక ప్రకటన

ఏపీలో డీఎస్సీకి సిద్ధమవుతున్న వారికి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. త్వరలో డీఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తామని.. అన్ని జిల్లా కేంద్రాల్లో మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్‌ విదేశీ విద్య పథకంతోపాటు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన అన్ని ఎస్సీ సంక్షేమ పథకాలనూ పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రాష్ట్ర సాంఘిక, సంక్షేమశాఖ అధికారులతో మంత్రిమ సెమినార్, సమావేశం నిర్వహించారు.

సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు ప్రతి నెలా హెల్త్‌చెకప్‌లు నిర్వహించాలి అన్నారు మంత్రి స్వామి. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి అన్నారు. ఎన్‌ఐటీ, ఐఐటీ, నీట్, ఇంజినీరింగ్‌ సీˆట్లు సాధించేలా బోధన ఉండాలి అని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని గురుకులాల్లో ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన సిబ్బందిని నియమిస్తామన్నారు మంత్రి. రాష్ట్రంలో ప్రతి వసతి గృహంలో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌ ఫొటోలు ఉండాలని సూచించారు. అక్కడి విద్యార్థులకు వారి పుస్తకాలను పంపిణీ చేస్తామని.. హాస్టల్స్‌లోని సీట్లన్నీ సెప్టెంబర్‌లోగా భర్తీ చేస్తామన్నారు. ప్రతి వసతి గృహంలో 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని.. అలాగే కాస్మొటిక్‌ ఛార్జీలను తిరిగి విద్యార్థులకే అందిస్తామన్నారు.

మరోవైవైపు ఐటీడీఏ ఆధ్వర్యంలో కూడా ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఈ డీఎస్సీ ఉచిత శిక్షణ శిబిరానికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఎక్కువమంది ఆసక్తి కనబరిచారు. ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. ఈ నెల 17వ తేదీ వరకూ ఈ ప్రక్రియ కొనసాగింది. దరఖాస్తులు అందించినవారిలో మూడు వందల మందిని ఎంపిక చేసి విశాఖపట్నంలో శిక్షణ అందిస్తారు. బీఈడీ, డీఈడీతోపాటు టెట్‌లో అర్హత పొందిన వారి నుంచి ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉచిత డీఎస్సీ శిక్షణను.. కేవలం మూడు వందల మందికే శిక్షణ ఇవ్వనుండటంతో అర్హులైన చాలా మంది నష్టపోతున్నారని, ఈ సంఖ్య పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు.

About amaravatinews

Check Also

అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఇంత దారుణమా.. ఏకంగా 10 మందితో కలిసి..

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించమని గట్టిగా అడిగినందుకు ఒక వ్యక్తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *