ఏపీలో విద్యార్థులకు అలర్ట్.. స్కూల్స్ టైమింగ్స్ మార్చారు, పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల సమయాల్లో మార్పులు చేశారు. అకడమిక్‌ కేలండర్‌లో ఆప్షనల్‌గా ఉన్న ఉన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్ని తప్పనిసరి చేసింది పాఠశాల విద్యా శాఖ. రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పనివేళలు ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉండగా.. దీన్ని 5 గంటల వరకు పెంచింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రతి మండలానికి రెండు (హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌) స్కూళ్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే బ్రేక్‌ల సమయం 5 నిమిషాల చొప్పున.. భోజన విరామం 15 నిమిషాలు పెంచింది ప్రభుత్వం. ఉదయం మొదటి పీరియడ్‌ 5 నిమిషాలు పెంచి 50 నిమిషాలు చేశారు. అంతేకాదు ఆ తర్వాత 3 పీరియడ్లు ప్రస్తుతం 40 నిమిషాల చొప్పున ఉండగా వాటిని 45 నిమిషాలకు పెంచారు. అంతేకాదు మధ్యాహ్నం మొదటి పీరియడ్‌ను మార్చకుండా.. ఆ తర్వాత 3 పీరియడ్లు 45 నిమిషాలకు పెంచారు. ఈ మార్పులతో రోజులో స్కూల్ సమయం గంట పెరుగనుంది.

నవంబర్‌ 25 నుంచి 30 వరకు ఎంపిక చేసిన స్కూళ్లలో ఈ విధానంలో పాఠశాలలు నడుపుతారు. కేవలం సబ్జెక్టులు బోధించడానికి మాత్రమే గంట సమయం పొడిగించామని.. మిగతా వెయిటేజీలో మార్పులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం తర్వాత ఈ నెల 30న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కి అభిప్రాయాలు నివేదించాలని ఆదేశాల్లో తెలిపారు.. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో అమలు చేయనున్నారు.

స్కూళ్ల కొత్త పనివేళలపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.. ప్రస్తుత పనివేళలనే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళల మార్పు నిర్ణయంపై పునరాలోచించాలని ఏపీటీఎఫ్‌ నేతలు కోరారు. 5 కి.మీ. పరిధి నుంచి విద్యార్థులు వస్తున్నందున సాయంత్రం ఐదింటి వరకు బడిలో ఉంటే ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని వారు చెబుతున్నారు. అలాగే వాతావరణం, ఇంటి సమస్యల దృష్ట్యా పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

About amaravatinews

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *